Mango Health Benefits: ఎండా కాలం వచ్చేసింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మెదలుపెట్టేశాడు. వేసవిలో ఎక్కువగా దొరికే పండ్లలలో మామిడి ఒకటి. దీనిని కింగ్ ఆఫ్ ప్రూట్స్ అని పిలుస్తారు. మామిడి పండును పచ్చడిగా, స్నాక్ గా కూడా ఉపయోగిస్తారు. మ్యాంగో ప్రూట్ తో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. భానుడి భగభగల నుంచి ఉపశమనం కలిగించడంలో మ్యాంగో అద్భుతంగా పనిచేస్తుంది. మామిడి పండు తినడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. దీని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామిడి పండు ఉపయోగాలు
** మామిడిలో పైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమవ్వడంలో సహాయపడుతుంది. 
** మామిడి పండు క్యాన్సర్ ను నిరోధించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 
** మ్యాంగో తినడం వల్ల దంత సమస్యలు కూడా దూరమవుతాయి. చిగుళ్ల నుండి  రక్తం కారడం కూడా తగ్గుతుంది. 
** మామిడిలో పైబర్, విటమిన్ మరియు పెక్టిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. దీంతో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
** ఇది చర్మానికి నిగారింపు ఇవ్వడంతోపాటు మృదువుగా చేస్తుంది.
** మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా మ్యాంగో సూపర్ గా పనిచేస్తుంది. 
** ఇందులో పోషకాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇది బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
** మ్యాంగో తినడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. 
**   మామిడి పండు తీసుకోవడం వల్ల మీ ఏకాగ్రతతోపాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. 
**  మామిడి పండ్లలో టార్టారిక్ మరియు మాలిక్ యాసిడ్‌తోపాటు సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది బాడీలోని క్షార నిల్వను నిర్వహించడానికి సహాయపడుతుంది. 


Also Read: White Hair To Black Hair: ఈ పువ్వుతో తెల్ల జుట్టు నల్లగా మారడమేకాకుండా, 5 రోజుల్లో జుట్టు రాలడానికి చెక్! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook