Summer Health Tips: తీవ్ర ఎండ కారణంగా డీ హైడ్రేషన్ సమస్యలు వస్తున్నాయా? ఈ జ్యూస్‌లతో చెక్!
Vegetable Juice In Summer: ప్రతి రోజు వేసవి కాలంలో ఈ కింద పేర్కొన్న రసాలు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డీ హైడ్రేషన్ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ రసాలు తాగండి.
Vegetable Juice In Summer: వాతావరణంలో తీవ్ర మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో వేసవి కాలం ప్రారంభమైంది. దీని కారణంగా ఎండలో అతిగా తిరగడం వల్ల హైడ్రేషన్ సమస్యలు వస్తాయి. ఈ సమస్య కారణంగా ప్రాణాంతక సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీర హైడ్రేట్‌గా ఉండడానికి పండ్ల రసాలతో పాటు వెజిటేబుల్ జ్యూస్‌లను తాగాల్సి ఉంటుంది. వీటిని తాగడం ఎండ కారణంగా వచ్చే సమస్యలు తగ్గడమేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రసాలను తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేసవిలో ఈ రసాలు తాగండి:
దోసకాయ రసం:
వేసవిలో దోసకాయ రసం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. అంతేకాకుండా శరీరంలో టాక్సిన్స్‌ను తొలగించి బాడీని డిటాక్సిఫై చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
సోరకాయ రసం:
ప్రతి రోజు సోరకాయ రసం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వేసవిలో ఈ రసాన్ని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతాయి.
కాకరకాయ రసం:
కాకరకాయ రసంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి వారంలో రెండు సార్లు కాకరకాయ రసం తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో ఈ రసాన్ని తీసుకోవడం వల్ల శరీరం డిటాక్సిఫై చేసేందుకు సహాయపడుతుంది.
టొమాటో రసం:
టొమాటో రసం శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి టొమాటో జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మలబద్ధకం, గ్యాస్ వంటి తీవ్ర పొట్ట సమస్యలు దూరమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి