Sunflower Seeds Beauty Benefits: మెరిసే చర్మం కావాలనేది ప్రతి ఒక్కరి కల. దీనికి రకరకాల ఉత్పత్తులు కూడా వినియోగిస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా సన్‌ఫ్లవర్‌ గింజలు ప్రయత్నించారా? ఇందులో చర్మ ఆరోగ్యాన్ని ప్రేరేపించే గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్స్‌, మినరల్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో మీ చర్మానికి విటమిన్‌ ఇ కూడా అందుతుంది. సౌందర్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సన్‌ఫ్లవర్‌ గింజల్లో లైనోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది చర్మానికి హైడ్రేషన్‌ పెంచుతుంది. అయితే, మీ ముఖానికి సన్‌ఫ్లవర్‌ గింజలు అప్లై చేయడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్‌ఫ్లవర్‌ గింజలు సైంటిఫికస్త్ర నేమ్‌ హీలియాంథస్‌ అన్నస్‌. దీని ద్వారా వంట నూనె తయారు చేస్తారు. ఇవి చిన్నగా ఓవల్‌ షేప్‌ లో ఉండి గ్రే కలర్‌లో కనిపిస్తాయి.  సన్‌ఫ్లవర్‌ గింజలు పచ్చిగా తినవచ్చు. వేయించుకుని కూడా తీసుకోవచ్చు. వివిధ వంటల్లో కూడా సన్‌ఫ్లవర్‌ గింజలు ఉపయోగిస్తారు. ఈ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్స్‌, విటమిన్ బీ1, బీ2, ఇ ఉంటాయి . కొన్ని నివేదికల ప్రకారం సన్‌ఫ్లవర్‌ గింజల్లో ఉండే విటమన్‌ ఇ పవర్‌ ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్‌ ఇది చర్మాన్ని ఆక్సిడేటివ్‌ డ్యామేజ్‌ కాకుండా నివారిస్తుంది. ఇందులో ఖనిజాలు పుష్కలంగా. సన్‌ఫ్లవర్‌ గింజలు మీ డైలీ రొటీన్‌లో చేర్చుకుంటే ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం అవుతుంది.


యాంటీఆక్సిడెంట్స్..
సన్‌ఫ్లవర్‌ గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్‌ డ్యామేజ్‌ కాకుండా చర్మాన్ని కాపాడుతుంది. ముఖానికి ఈ గింజలు సూర్యుని హానికరమైన కిరణాల నుంచి ఓ షీల్డ్‌లా పనిచేస్తుంది. ఇది సన్‌బర్న్‌ సమస్యను కూడా నివారించి త్వరగా ముఖంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది.


చర్మానికి పోషణ..
సన్‌ఫ్లవర్‌ గింజల్లో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇది స్కిన్‌ హైడ్రేషన్‌ పెంచి మంచి పోషణ అందిస్తుంది. సన్‌ఫ్లవర్‌ గింజలు చర్మం పొడిబారకుండ కాపాడతాయి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ మీ చర్మానికి మాయిశ్చర్‌ నిలుపుతాయి. దీంతో మీ స్కిన్‌ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ముఖ్యంగా డ్రై స్కిన్‌ సమస్యతో బాధపడేవారికి ఇది ఎఫెక్టీవ్‌ రెమిడీ.


యంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు..
సన్‌ఫ్లవర్‌ గింజల్లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం దురద సమస్యను నివారిస్తుది. ఎజిమా, సోరియాసిస్‌ నివారించి యాక్నేకు యాంటీగా పోరాడుతుంది. మీ డైలీ రొటీన్‌లో సన్‌ఫ్లవర్‌ గింజలు చేర్చుకుంటే చాలు ఈ లాభాలు పొందుతారు.


స్కిన్‌ ఆరోగ్యం..
సన్‌ఫ్లవర్‌ గింజలు ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్‌ కలిగి ఉంటాయి. ఇవి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయి. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా సాగే గుణం కలిగి ఉంటుంది. ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. సన్‌ఫ్లవర్‌ గింజల నూనె ముఖానికి ఉపయోగించిన మంచి లాభాలను పొందుతారు. ఫైన్‌లైన్స్‌కు ఇవి చెక్‌ పెడతాయి.


ఇదీ చదవండి:  ఈ ఆకు రసం తెల్లజుట్టును 5 నిమిషాల్లో నల్లగా మారుస్తుంది.. సాయి పల్లవి హెయిర్‌ కేర్‌ రొటీన్‌లో ఇది తప్పనిసరట..


సన్‌ఫ్లవర్‌ గింజలు ఎలా ఉపయోగించాలి?
ఫేషియల్‌ స్క్రబ్..
ఒక గుప్పెడు సన్‌ఫ్లవర్‌ గింజలు
తేనె-1tbp
లెమన్‌ - కొన్ని చుక్కలు.
సన్‌ఫ్లవర్‌ గింజలు బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక చెంచా తేనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
దీన్ని ముఖం మెడ ప్రాంతంలో మృదువుగా మసాజ్‌ చేయాలి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేసి డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ను తొలగిస్తుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్‌వాష్‌ చేయాలి.


సన్‌ఫ్లవర్‌ గింజలు మాయిశ్చరైజర్‌..
కొన్ని చుక్కల సన్‌ఫ్లవర్‌ గింజలు నూనె కొల్డ్‌ ప్రెస్డ్‌ మంచి టోనింగ్‌, క్లెన్సింగ్‌ మాదిరి ఉపయోగించవచ్చు. దీన్ని ముఖంపై సర్క్యూలర్‌ మోషన్‌లో చర్మం గ్రహించే వరకు మసాజ్‌ చేస్తూ ఉండాలి. ఇది ఓపెన్‌ పోర్సకు కూడా చెక్‌ పెడుతుంది.


ఇదీ చదవండి: మీ మాజీతో మళ్లీ స్నేహం చేయాలనుకుంటున్నారా? ఇది సరైందా? కాదా?


సన్‌ఫ్లవర్‌ గింజల మాస్క్‌..
గుప్పెడు సన్‌ఫ్లవర్‌ గింజలు
పెరుగు 1 tbsp
తేనె -1tbsp


సన్‌ఫ్లవర్‌ గింజలు పేస్ట్‌ మాదిరి గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో పెరుగు, తేనె వేసి మాస్క్‌ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ముఖానికి మాస్క్‌ మాదిరి వేసుకుని 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. సాధారణ నీటితో ఫేస్‌వాష్‌ చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter