Black Garlic: నల్ల వెల్లుల్లితో దివ్యమైన లాభాలు.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు..!
Black Garlic: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అనే సామెత మీరు విని ఉంటారు. వెల్లుల్లిని మనం ఎక్కువగా వంట్లలోకి వాడుతూ ఉంటాము. అయితే మనం తరుచుగా వాడే వెల్లుల్లి తెలుసు రంగులో ఉంటుంది. కానీ మీరు నల్ల వెల్లుల్లి గురించి మీకు తెలుసా..? ఈ నల్ల వెల్లిల్లిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Black Garlic Benefits: మనం ఇంట్లో చేసుకోనే వంట్లలో వెల్లుల్లిని తరుచుగా వాడుతూ ఉంటాము. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే ఇది తెలుపు రంగులో ఉంటుంది. కానీ నల్ల వెల్లుల్లి గురించి మీరు ఎప్పుడైన విన్నారా.. ఇది చూడడానికి నల్లగా ఉంటుంది. ఈ వెల్లుల్లిని కిణ్వ ప్రక్రియతో తయారు చేస్తారని తెలుస్తోంది. సాధారణ వెల్లుల్లితో పోల్చితే దీని రుచి, వాసన, ఘాటు తగ్గువుగా ఉంటుంది. నల్ల వెల్లుల్లిలో ఎస్ అల్లైల్ సిస్టీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
దీనిని మనం తీసుకోవడం వల్ల ఒత్తిడి సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. శరీరంలో ఇన్‌ప్లామేషన్ తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గి మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌లు పెరుగుతాయి.
నల్ల వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని సూప్స్, టోస్ట్,సలాడ్స్ వంటి వాటితో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Beehive Remove Tips: ఇంట్లో సులభంగా తేనెపట్టు వదిలించే 5 మార్గాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి