Beehive Remove Tips: ఇంట్లో సులభంగా తేనెపట్టు వదిలించే 5 మార్గాలు

తేనె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందరూ ఇష్టపడతారు కూడా. అదే తేనె పట్టు చూస్తే మాత్రం భయమేస్తుంటుంది. తేనెటీగల దాడి భయం ఉంటుంది. ఒక్కోసారి ఇంటి బాల్కనీలో లేదా ఇంట్లోని చెట్లకు తేనెపట్టు పడుతుంటుంది. అయితే ఎలాంటి నష్టం కలగకుండా తేనెటీగల్ని వదిలించవచ్చు. ఆ టిప్స్ చూద్దాం..

Beehive Remove Tips: తేనె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందరూ ఇష్టపడతారు కూడా. అదే తేనె పట్టు చూస్తే మాత్రం భయమేస్తుంటుంది. తేనెటీగల దాడి భయం ఉంటుంది. ఒక్కోసారి ఇంటి బాల్కనీలో లేదా ఇంట్లోని చెట్లకు తేనెపట్టు పడుతుంటుంది. అయితే ఎలాంటి నష్టం కలగకుండా తేనెటీగల్ని వదిలించవచ్చు. ఆ టిప్స్ చూద్దాం..
 

1 /5

పిప్పర్‌మింట్ పుదీనా లేక పుదీనా ఆయిల్ సహాయంతో స్ప్రే చేసి చల్లితే తేనెటీగలు పారిపోతాయి. 

2 /5

వెల్లుల్లి వెల్లులి ఘాటైన వాసన కారణంగా చాలామంది ఇష్టపడరు. అదే విధంగా తేనెటీగలకు కూడా పడదు. కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని తీసుకుని పేస్ట్ చేసి నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో వేసి స్ప్రే చేస్తే మంచి ఫలితాలుంటాయి. దరిదాపుల్లో తేనెటీగలు కన్పించవు.

3 /5

దాల్చిన చెక్క దాల్చినచెక్కను సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తారు. కానీ దీంతో తేనెటీగల్ని పారద్రోలవచ్చు. దాల్చిన చెక్క సువాసన తేనెటీగలకు పడదంటారు. దాల్చిన చెక్కను ఏదైనా ప్లేట్‌లో కాల్చి తేనెపట్టు కింద ఉంచాలి. అంతే క్షణాల్లో తేనెటీగలు తొలగిపోతాయి.

4 /5

వెనిగర్ ఒక స్ప్రే బాటిల్ తీసుకుని సగం నీళ్లు, సగం వెనిగర్ మిక్స్ చేయాలి. మిమ్మల్ని మీరు పూర్తి కప్పుకోవాలి. ఇప్పుడు తేనెపట్టు పట్టిన చోటికి ఎక్కి దానిపై స్ప్రే చేయాలి. క్షణాల్లో వెళ్లిపోతాయి.

5 /5

పొగ బెట్టడం తేనెటీగల తేనెపట్టు కింద ఎండు కట్టెలు, వేపాకులు ఉంచి మంట పెట్టాలి. ఈ పొగ తేనెపట్టువైపు వెళ్లేలా చేయాలి. లోపలకు రాకుండా తలుపులు, కిటికీలు క్లోజ్ చేయాలి. కాస్సేపటికి కచ్చితంగా తేనెటీగలు వెళ్లిపోతాయి.