Pineapple Benefits: పడక సుఖం పెంచే పైనాపిల్ పండు తింటే కేకో కేక
Health Benefits of Pineapple: పైనాపిల్ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శృంగార జీవితంపై పైనాపిల్ ప్రభావం అధికంగా ఉంటుందట. మరి పడక సుఖంలో మిమ్మల్ని రారాజును చేసే పైనాపిల్ పండును మీ డైట్‌లో ఎలా భాగం చేసుకోవాలి ఏంటనే వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందామా.
Health Benefits of Pineapple: లైంగిక వాంఛలు పెరగడానికి, శృంగారంలో శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి పలు రకాల ఆహార పదార్థాలపై ఆధారపడటం అనేది శతాబ్ధాల తరబడిగా ఆనవాయితీగా వస్తోందనే విషయం తెలిసిందే. ఆల్చిప్పలు నుంచి మొదలుకుని చాక్లేట్స్ వరకు పలు రకాల ఆహార పదార్థాలు శృంగార కోరికలు పెంచడంతో పాటు శృంగార సామర్ధ్యం పెంపుకోసం ఉపయోగిస్తుంటారు. పైనాపిల్ కూడా అలాంటి ఫుడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. లైంగిక వాంఛలు పెంచడంతో పాటు శృంగార సామర్థ్యం పెంచడానికి పైనాపిల్ పండు ఎంతో సహాయపడుతుంది. అందుకే మీ శృంగార జీవితానికి పైనాపిల్ పండు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈ కథనం ద్వారా తెలుసుకుందాం రండి.
లైంగిక వాంఛలు ప్రేరేపించే పైనాపిల్
పైనాపిల్ పండునే అనాస పండు అని కూడా అంటారు. ఈ పైనాపిల్ పండులో బ్రోమ్లేన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మీలో లైంగిక వాంఛలు కలిగేలా చేయడంతో పాటు శృంగారంలో రెచ్చిపోయేలా చేస్తుంది.
పైనాపిల్ పండు పోషక విలువల ప్రయోజనాలు
పైనాపిల్ పండులో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. మీ శృంగార సామర్ధ్యం పెంపొందించే పోషక విలువలు ఈ అనాస పండు సొంతం.
పైనాపిల్, టెస్టోస్టిరాన్
పైనాపిల్ పండుకి లైంగిక వాంఛలకు, శృంగార సామర్థ్యానికి ఏంటి సంబంధం అని అనుకోవద్దు. ఎందుకంటే లైంగిక వాంఛలు కలిగేందుకు కారణమయ్యే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేసే మాంగనీస్ మినరల్స్ ఈ పైనాపిల్ పండులోనే పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ పండు తిన్నప్పుడు విడుదలయ్యే మాంగనీస్ టెస్టోస్టిరాన్ హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తోంది. అలా ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ మీలో లైంగిక వాంఛలను పెంచుతుంది.
మీ డైట్‌లో పైనాపిల్ పండు ఉండేలా చూసుకోండి
క్రమం తప్పకుండా పైనాపిల్ పండు తినడం వల్ల వీర్యంలో నాణ్యత పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి యాంటి-ఇన్‌ఫ్లేమేటరీగా పనిచేస్తుంది.
లైంగిక వాంఛలు కలిగేలా చేసి మీ సెక్స్ డ్రైవ్ మెరుగుపడేలా చేయడంలో పైనాపిల్ పండు ఒక మంచి రుచికరమైన ఆహారం అనే అనుకోవచ్చు.
పైనాపిల్ పండును ముక్కలుగా కట్ చేసుకుని స్నాక్స్ తరహాలో ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే చల్లటి పానియాలుగా తయారు చేసుకోవచ్చు, ఫ్రూట్ సలాడ్స్ వంటి ఐటమ్స్‌లోనూ పైనాపిల్ పండ్లను మిశ్రమంగా కలిపి ఆరగించవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు:
పైనాపిల్ పండు నిజంగానే మీలో లైంగిక వాంఛలు పెంచుతుందా ?
పైనాపిల్ పండు నేరుగా మీలో లైంగిక కోరికలు కలిగిస్తుందనే శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేనప్పటికీ.. ఈ పండులో అధిక మోతాదులో ఉండే పోషకాలు లైంగిక పటుత్వాన్ని మెరుగుపర్చేందుకు మాత్రం ఉపయోగపడతాయనుకోవచ్చు.
పైనాపిల్ తినడం వల్ల వీర్యం రుచి పెరుగుతుందా ?
పైనాపిల్ తినడం వల్ల వీర్యం రుచికరంగా తయారవుతుందని కొంతమంది విశ్వసిస్తారు కానీ వారి వాదనని బలపర్చే శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవు.
పైనాపిల్ పండును ఏ మేరకు తింటే ప్రయోజనాలు కనిపించే అవకాశం ఉంది ?
ఇంత మేరకు లేదా అంత మేరకు తింటేనే పైనాపిల్ పండు ఫలితాలు కనిపిస్తాయని ఏం లేదు. ఒకేసారి ఈ పండును తిని దాని ప్రయోజనాలు ఆశించడం కంటే.. క్రమం తప్పకుండా తినడం వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి.
పైనాపిల్ ఎక్కువగా తింటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం లేదా ఇబ్బందులు ఎదురవడం అనేది జరుగుతుందా ?
సాధారణంగా పైనాపిల్ తినడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏవీ లేవు. అయితే, మరీ ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు మాత్రం జీర్ణ సమస్యలు తలెత్తి డయేరియా బారినపడే ప్రమాదం ఉంది. కొంతమందికి ఈ పండుని ఎక్కువగా తింటే ఎలర్జీ కూడా వస్తుంది.
పైనాపిల్ పండు రుచికి రుచి ఎంజాయ్ చేయొచ్చు.. అలాగే సెక్సులో రెచ్చిపోయేందుకు అవసరమయ్యే శక్తిని సైతం పొందొచ్చు. లైంగిక సమస్యలను నయం చేసే మ్యాజిక్ ఏదీ లేనప్పటికీ.. పైనాపిల్ పండు మాత్రం మీ శృంగార జీవితాన్ని సుఖమయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు న్యూట్రిషనల్ ఎక్స్‌పర్ట్స్. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని తింటారా లేక జ్యూస్, స్మూతీలుగా చేసుకుని తాగుతారా అనేది మీ ఇష్టం. ఏదేమైనా పైనాపిల్ పండును మీ డైట్‌లో భాగం చేసుకుని, బెడ్ రూమ్‌లో శృంగార జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Jaggery Vs Sugar: మీ ఆరోగ్యానికి షుగర్ మంచిదా..? లేక బెల్లం మంచిదా..?
ఇది కూడా చదవండి : Hair Loss Issue: జుట్టు రాలుతోందని టెన్షన్ పడుతున్నారా ?
ఇది కూడా చదవండి : Blueberries Health Benefits: బ్లూబెర్రీస్.. తింటే ఆల్ హ్యాపీస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook