Sugar Spike Foods: డయాబెటిస్ అనేది ఒక సంక్లిష్ట వ్యాధి. ఇది ఒక వ్యక్తికి ఒకసారి వచ్చిదంటే జీవితాంతం అతన్ని విడిచిపెట్టదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ అధిక చక్కెర ఆహారాలకు దూరంగా ఉండాలి. మధుమేహ రోగులకు తీపి పదార్థాలు విషం కంటే తక్కువ కాదు. ఎందుకంటే దీని కారణంగా గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉండదు. అంతేకాదు ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిక్ రోగులు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. కానీ కొంతమంది ఆహారపరంగా వారి కోరికలను నియంత్రించలేరు. ఇది వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుందని ప్రముఖ పోషకాహార నిపుణుడు నిఖిల్ వాట్స్ అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షుగర్ లెవల్స్ పెంచే ఆహారాలు ..
1. కాఫీ:
మనరోజువారీ దినచర్య కాఫీ లేదా టీతో ప్రారంభం అవుతుంది. కానీ, కాఫీని ఎక్కువగా తాగకపోవడం మంచిది, ఎందుకంటే ఇందులో కెఫిన్ ఉంటుంది. రక్తపోటును పెంచడాన్ని ప్రోత్సహిస్తుంది. కొంతమంది ఫ్లేవర్డ్ కాఫీని తాగడానికి ఇష్టపడతారు, కానీ అందులో చక్కెర అధికశాతం ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు అస్సలు మంచిది కాదు. వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండటమే మంచిది.


2. చాక్లెట్ మిల్క్:
మనలో చాలా మందికి చాక్లెట్ సిరప్ కలిపిన పాలు తాగడం ఇష్టం, కానీ ఈ అలవాటు మధుమేహ రోగులకు ప్రమాదకరంగా మారుతుంది. చాక్లెట్ మిల్క్‌లో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. లేకపోతే ఇది తాగిన వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. 


Also read: Health Benefits of Ram Kand: శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పండు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఈరోజు నుంచే మీరూ తింటారు


3. టొమాటో సాస్:
ఏదైనా ఆహార రుచిని పెంచడానికి మనం టొమాటో సాస్ జోడించి తినడానికి ఇష్టపడతాం. ముఖ్యంగా బేక్ చేసిన ఆహారాల్లో ఎక్కువగా వాడతాం. ఎందుకంటే కెచప్ రుచి మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. అయితే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు .


4. హై షుగర్ ఫ్రూట్:
తాజా పండ్లు ఆరోగ్యకరమైన ఆహారంలో చేర్చుకోవాలి. అయితే కొన్ని పండ్ల వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని వేగంగా పెంచుతుంది. మామిడి ,పైనాపిల్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు తినగానే మన రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోతాయి.



5. పెరుగు:
పెరుగు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతున్నప్పటికీ, ఈ రోజుల్లో ఫ్లేవర్డ్ యోగర్ట్ కు చాలా డిమాండ్ ఉంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచడానికి పనిచేస్తుంది.


Also read: Why Black Grapes Costly: ఆకుపచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష ఎందుకు ఖరీదైంది? ఎప్పుడైనా ఈ లాజిక్ ఆలోచించారా ?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter