Heart Attack: బాలీవుడ్ బుల్లితెర నటుడు మరియు బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా(Siddharth Shukla) 40 సంవత్సరాల వయస్సులో గుండెపోటు(Heart Attack)తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అందరినీ కలచివేసింది. ఇటీవల కాలంలో చాలా తక్కువ వయసున్నవారు గుండెపోటుకు గురవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గణాంకాల ప్రకారం.. భారతదేశంలో ప్రతి 4 మరణాలలో ఒకరు హృదయ సంబంధ వ్యాధుల(Diseases) కారణంగా మరణిస్తున్నారు. 80 శాతం కేసులకు గుండెపోటే కారణం. ఆశ్చర్యకరంగా 40 నుంచి 55 ఏళ్ల వ్యక్తులే ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే గుండెపోటు కారణంగా అకాల మరణాల సంఖ్య పెరుగుతున్నందున ఆయుర్వేద నిపుణులు(Ayurvedic experts) 5 పద్దతులను సూచిస్తున్నారు. 


Also Read:Health tips: ఆహారం జీర్ణం అవట్లేదా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!


ఆ పద్ధతులు ఏంటంటే..


1. సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం
ప్రతి ఒక్కరు సూర్యోదయానికి రెండు గంటల ముందే నిద్రలేవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తెల్లవారుజామున మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందని, ఏది చేసినా దాని ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు.


2. రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి
ఆయుర్వేద నిపుణులు ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగమని సిఫార్సు చేస్తున్నారు. ఇది శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా కాపాడుతుందన్నారు. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని సూచించారు.


3. యోగా, ధ్యానం సాధన చేయాలి
ఎండార్ఫిన్స్, సెరోటోనిన్-మూడ్ అప్‌లిఫ్టింగ్ వంటి ఒత్తిడిని తగ్గించే హార్మోన్‌లను సరైన మోతాదులో పొందడానికి ప్రతిరోజూ యోగా, మెడిటేషన్ తప్పనిసరి. దీర్ఘకాలిక ఒత్తిడి, డిప్రెషన్ గుండె జబ్బులకు ప్రధాన కారణమని పలు అధ్యయనాలలో తేలింది. అందుకే కచ్చితంగా యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


4. ఆహారం తీసుకోవడానికి సరైన సమయం
అల్పాహారం 7.00 AM, భోజనం 12-12.30 PM కి చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం, టిఫిన్ మధ్య 4 నుంచి 5 గంటల గ్యాప్ ఉండాలన్నారు. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి తోడ్పడుతుందన్నారు. ప్రతిరోజు ఎక్కువగా నీరు తాగాలి. భోజనం చేసిన కొద్ది సేపటి తర్వాత గింజలు, పండ్లు తింటే మంచిది. మంచి నిద్ర కోసం కనీసం 2 గంటల భోజనాన్ని ముగించాలి. అప్పుడే జీర్ణక్రియ సజావుగా సాగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


5. మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండాలి
మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది నిద్రలేమి, అలసట, బద్ధకాన్ని పెంచుతుంది. వృద్ధులు కావాలనుకుంటే యోగ నిద్ర చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook