Health tips: ఆహారం జీర్ణం అవట్లేదా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

Health tips: ఈ బిజీ లైప్ లో పడి జనాలు తినడం మరచిపోతున్నారు. ఏదో ఒక సమయంలో తింటూ..అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2021, 07:43 PM IST
Health tips: ఆహారం జీర్ణం అవట్లేదా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

Health tips: అసలే ఉరకులు పరుగుల జీవితం. ఈ బిజీ లైఫ్ లో పడి మనిషి తినడం మరచిపోతున్నాడు. ఏదో ఒక సమయానికి తింటూ అనారోగ్యం(unhealthy) బారినపడుతున్నాడు. అంతేకాదు సరైన సమయానికి తినకపోవడంతో జీర్ణ సమస్యలు(digestive problems) ఎదుర్కొంటున్నాడు. 

మనం తీసుకునే ఆహారం(food), మన జీవన విధానం బట్టి మన ఆరోగ్యం(health) ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటివి ఎక్కువవుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ తో జీర్ణం కాక... అధిక బరువు పెరగడం.. ఒక్కటేమిటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు(health problems) తలెత్తుతున్నాయి. తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌టంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ(digestive system) ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కొన్ని ఆహారాల‌ను కొద్ది రోజుల పాటు తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవ‌డ‌మే కాదు, ఆయా జీర్ణ స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. 

Also Read: Home Remedies for Platelets: ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయా..! ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచే చిట్కాలు మీకోసం..

ఆ పదార్థాలు ఏంటంటే..
సలైవాలో వుండే ఎంజైమ్స్ జీర్ణ ప్రక్రియ మొదలు పెడతాయి. అయితే చాలా మంది వేగంగా నమలకుండా తినేస్తుంటారు. అలా కాకుండా నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. చద్దన్నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది గ్యాస్టిక్(Gastric), ఎసిడిటి మరియు కాన్స్టిపేషన్ సమస్యలను దూరం చేస్తుంది కాబట్టి ఉదయాన్నే చద్దన్నం తినడం మంచిది. ఆపిల్ సైడర్ వెనిగర్ కాన్స్టిపేషన్ ,  గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది.

యాపిల్(Apple) పండ్ల‌లో పుష్క‌లంగా ఉండే పెక్టిన్ జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌య్యేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక నిత్యం యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.  సోంపు గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణాశ‌యంలో ఆహారం క‌ద‌లిక‌ను స‌రిచేస్తుంది. దీంతో క‌డుపు నొప్పి(stomach pain), అజీర్ణం, గ్యాస్ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది.

నిత్యం ఉద‌యాన్నే అల్పాహారానికి ముందు కొద్దిగా అల్లం(Ginger) ర‌సం సేవిస్తే.. మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అలాగే వికారం, వాంతులు త‌గ్గుతాయి. గ్యాస్‌(Gas), అసిడిటీ(Acidity) రాకుండా ఉంటాయి. భోజ‌నానికి ముందు పుదీనా ర‌సం తీసుకుంటే జీర్ణ స‌మ‌స్య‌లు(Digestive problems) రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది, విరేచ‌నాలు ఆగుతాయి

భోజనం చేసిన తర్వాత జీలకర్ర(Cumin) తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, ఎసిడిటి సమస్యలు ఉండవు. ప్రతి రోజు కూడా ఆహారాన్ని సరైన సమయానికి తినాలి. చాలా మంది తినకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అదే విధంగా ఒత్తిడి, నిద్ర కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని గమనించండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News