Flaxseeds Hair packs: అవిసె గింజలు జుట్టును మందంగా మృదువుగా చేస్తాయి. ఇది మీ జుట్టుపై ఓ మ్యాజిక్‌ చేస్తుంది. జుట్టు ఫోలికల్స్‌ ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది స్ల్పిట్‌ ఎండ్స్‌ సమస్యను కూడా తగ్గిస్తుంది. అవిసెగింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్‌, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. కుదుళ్లను మాయిశ్చర్‌ నిలుపుతుంది. ఇందులోని ఖనిజాలు కుదుళ్లు పొడిబారకుండా డ్యాండ్రఫ్‌ సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవిసె గింజల్లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మెరుపుదనం అందిస్తుంది. సహజసిద్ధంగా మీ జుట్టు మెరిసిపోతుంది. మీ డైట్లో కూడా ఫ్లాక్స్‌ సీడ్‌ చేర్చుకోవాలని వెబ్ఎండీ నివేదిక తెలిపింది.


హెయిర్‌ మాస్క్‌..
అవిసెగింజలు ఒక స్పూన్‌, యోగార్ట్‌ రెండు స్పూన్లు, అరస్పూన్‌ తేనె బాగా కలిపి మిక్స్‌ చేయాలి. ఈ పేస్టును జుట్టంతటికీ అప్లై చేసి ఓ గంటపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత హెయిర్‌ వాష్‌ చేసుకుని కండీషనర్‌ కూడా అప్లై చేయండి. దీంతో మీ జుట్టు మృదువుగా మారిపోతుంది. ఈ హెయిర్‌ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించండి.


ఇదీ చదవండి: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..


జెల్‌..
పావు వంతు అవిసె గింజల్లో మూడు కప్పుల నీరు పోసి బాగా మరిగించాలి. జెల్‌ మాదిరి మారిన తర్వాత చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కలబంద కూడా వేసి కలిపి జుట్టంతటికీ పట్టించాలి. ఆరిన తర్వాత హెయిర్‌ వాష్‌ చేయాలి. ఇది కూడా వారానికి రెండుసార్లు ప్రయత్నించండి.


అరటిపండు మాస్క్‌..
అవిసెగింజలను పౌడర్‌లా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులోనే కట్‌ చేసన అరటిపండ్లను కూడా వేసి బనానా హయిర్ మాస్క్‌ తయారు చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి పట్టంచాలి.


ఆలివ్‌ ఆయిల్.. 
ఒక స్పూన్‌ అవిసె గింజల పొడిలో ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసం వేసి మాస్క్‌ను తయారు చేయాలి. దీన్ని జుట్టంతటికీ పట్టించి ఓ అరగంటపాటు ఆరనివ్వండి ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.


ఇదీ చదవండి: మన దేశంలో వారాహీ అమ్మవారు దేవాలయాలు ఎక్కడున్నాయి.. వాటి ప్రత్యేకతలు ఏమిటంటే.. !


అవిసె గింజల నూనె..
అవిసె గింజలతో తయారు చేసిన నూనె కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ అవిసె గింజల నూనెను జుట్టంతటికీ పట్టించి ఆరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి