Almond Oil Benefits: డ్రైఫూట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు  చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా తయారు అవుతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు ఒకటి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో పోషక విలువలు అధికంగా ఉంటాయి. బాదంపప్పు మాత్రమే కాకుండా దీని నూనె కూడా ఎంతో సహాయపడుతుంది. బాదం నూనెలో కూడా బోలెడు లాభాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విటమిన్ ఏ, ఈ , ఒమేగా-3 ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాదం నూనెలో ప్రోటీన్‌, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక బరువు సమస్యలకు చక్కటి మందు అని చెప్పవచ్చు. మీర ఆహారంలో ఈ బాదం నూనెను ఉపయోగించడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గించడమే కాకుండా చర్మ సమస్యలకు తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా వేసవిలో కలిగే నల్ల మచ్చలు, ఛాయ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. 


అంతేకాకుండా బాదం నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. దీంతో పాటు జుట్టు పెరుగుదలకు, ఎముకల బలంకు ఇది చాలా మంచిది. బాదం నూనె మలబద్ధకం సమస్యను తగ్గించి, పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రేగుల కదలికను మెరుగుపరుచుతుంది. మధుమేహం ఉన్నవారికి బాదం నూనె చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.


బాదం నూనెలోని యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ మన రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.  తామర, స్కాల్ప్ సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో బాదం నూనె చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బాదం నూనెను వాడడం వల్ల  శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. శ‌రీరంలో వాపు, మంట‌, నొప్పులు వంటి లక్షణాలు తగ్గుతాయి.  ఈ విధంగా బాదం నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 


బాదం నూనెను ఉపయోగించవచ్చు:


జుట్టుకు:


రాత్రి పూట మీ తలపై బాదం నూనెను మసాజ్ చేసి, ఉదయం షాంపూ చేసుకోండి. జుట్టు రాలడాన్ని బాదం నూనెను మసాజ్ చేయండి.  మీ జుట్టుకు బాదం నూనెను రాసుకోండి. జుట్టును మెత్తగా, మృదువుగా చేయడానికి షాంపూ చేసిన తర్వాత మీ జుట్టు చివర్లకు కొద్దిగా బాదం నూనెను రాసుకోండి.


చర్మానికి:


ముఖం మాయిశ్చరైజర్ గా: ముఖం మీద బాదం నూనెను రాసుకోండి.


మేకప్ రిమూవర్ గా: మీ ముఖం మీద బాదం నూనెను రాసి, మృదువైన గుడ్డతో తుడవండి.


చర్మాన్ని మృదువుగా చేయడానికి: స్నానం చేసిన తర్వాత తడి చర్మానికి బాదం నూనెను రాసుకోండి.


చర్మం వాపును తగ్గించడానికి: దద్దుర్లు లేదా చికాకుకు గురైన చర్మానికి బాదం నూనెను రాసుకోండి.


ఇతర ఉపయోగాలు:


నాణ్యమైన నిద్ర పొందడానికి: రాత్రి పూట మీ శరీరానికి బాదం నూనెను మసాజ్ చేయండి.


మలబద్ధకాన్ని తగ్గించడానికి: ఒక టేబుల్ స్పూన్ బాదం నూనెను ఖాళీ కడుపుతో తాగండి.


గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి: మీ ఆహారంలో బాదం నూనెను చేర్చండి.


బాదం నూనెను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని చిట్కాలు:


శుద్ధమైన, ఆర్గానిక్ బాదం నూనెను ఎంచుకోండి. బాదం నూనెను ఉపయోగించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.


అలెర్జీ పరీక్ష కోసం మీ మోచేయి లోపలి భాగంలో కొద్దిగా బాదం నూనెను రాసుకోండి.


బాదం నూనెను చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.


బాదం నూనె ఒక బహుముఖ నూనె, దీనిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. మీ ఆరోగ్యం, సౌందర్యానికి ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి