Kitchen Tips: సాధారణంగా మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా చాలాసార్లు బొద్దింక సమస్యను నివారించలేము. మార్కెట్‌లో లభించే రకరకాల స్ప్రేలతో కూడా వాటిని వదిలించుకోవడం కష్టం. అదనంగా, అటువంటి స్ప్రేల నుండి చికాకు ,అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సహజంగా బొద్దింకలను వదిలించుకోవడానికి చిట్కాలను తెలుసుకుందాం .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లవంగాలు: బొద్దింకలను తరిమికొట్టేందుకు కూడా లవంగాలను ఉపయోగించవచ్చు. లవంగాల పొడిని బొద్దింకలు ఉన్న ప్రదేశాలకు చల్లాలి. బొద్దింకలు లవంగాల వాసనను ఇష్టపడవు. అవి తట్టాబుట్టా సర్దుకుని పారిపోతాయి. ఈ వాసనకు అవి పూర్తిగా మీ ఇంటి నుండి బయటకు వెళ్లిపోతాయి.


ఇదీ చదవండి: Red Aloevera: ఎర్రకలబంద, పచ్చకలబంద కంటే 22 రెట్లు శక్తివంతమైంది.. దీని అద్భుతప్రయోజనాలు తెలుసా?


పులావ్ ఆకులు:  పులావ్ ఆకులను బే లీఫ్స్ అని కూడా అంటారు. ఈ ఆకులు బొద్దింకలను తరిమికొడతాయని మీకు తెలుసా? ఇది చాలా సులభం. కొన్ని బే ఆకులను తీసుకొని వాటిని గ్రైండర్లో రుబ్బుకోవాలి. ఆ తర్వాత రెండు లేదా మూడు చెంచాల పొడిని వేడి నీటిలో వేసి మరిగించాలి. మిశ్రమం చల్లారిన తర్వాత ఇంటి మూలల్లో స్ప్రే చేయాలి. అక్కడ నుంచి పారిపోతున్న బొద్దింకలను చూడవచ్చు.


ఇదీ చదవండి: Home Cleaning Tips: అరటిపండు తొక్కపై నిమ్మకాయను రాస్తే ఏమౌతుందో తెలుసా?


బేకింగ్ సోడా: బేకింగ్ సోడా కూడా ఉపయోగించవచ్చు. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక టేబుల్ స్పూన్ పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు సంచరించే చోట స్ప్రే చేయాలి. పంచదార తినడానికి వచ్చిన బొద్దింకలు బేకింగ్ సోడా వాసన వస్తే పారిపోతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter