Heartburn Remedies: గ్యాస్ట్రిక్ వల్ల గుండెలో మంట.. ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి!
Gastric Heartburn Remedies: గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా గుండెలో మంట, కడుపు నొప్పి కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఈ ఇంటి చిట్కాలను తప్పకుండా ప్రయత్నించండి.
Gastric Heartburn Remedies: నేటికాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యల బారిన పడుతున్నారు. ఈ గ్యాస్ వల్ల శరీరంలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా కడుపు నొప్పి, తలనొప్పి, గుండెలో మంట వంటి ఇతర సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అయితే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల గుండెలో మంట చాలా మందిని బాధించే సాధారణ సమస్. ఈ సమస్యలకు కారణం కడుపులోని యాసిడ్ రసాయనాలను చేరడం. ఈ యాసిడ్ కారణంగా గుండెలో మంట, నొప్పి, దగ్గు, మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కలిగిస్తుంది.
అయితే సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మందులు, టానిక్ ను ఉపయోగిస్తారు. కానీ దీని వల్ల ఎలాంటి లాభాం ఉండదు. ఇక్కడ చెప్పిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సమస్య నుంచి మీరు బయట పడవచ్చు. అలాగే కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని చిట్కాలు:
ఆహారం:
గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం పొందాలి అంటే తీపి, కారం, పులుపు, నూనె, వేయించిన ఆహారాలు తగ్గించండి. దీనికి బదులుగా పెరుగు, మజ్జిగ, ఆకుకూరలు, పండ్లు, తాజా ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తీసుకోండి. చక్కెర వాడకం తగ్గించి, బెల్లం వాడండి.
రాత్రి భోజనం త్వరగా (రాత్రి 8 గంటల లోపు) తినండి:
మీరు ఆహారాని పూర్తిగా నమిలి తినండి. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
ఒత్తిడిని నివారించండి:
గ్యాస్ట్రిక్ సమస్య తగ్గాలి అంటే మీరు మద్యపానం, ధూమపానం మానుకోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:
శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి నీరును బాగా తాగండి.
మందులు:
మీ వైద్యుడి సలహా మేరకు యాసిడ్ నివారణ మందులు వాడండి. మీరు అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి.
ఇంటి చిట్కాలు:
* కలబంద రసం తాగడం వల్ల గుండెలో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
* జీలకర్ర, ధనియాల పొడి నీటిలో కలిపి తాగితే కడుపులోని యాసిడ్ తగ్గుతుంది.
* వేడి పాలు తాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.
ఈ చిట్కాలను పాటించడం వల్ల గ్యాస్ట్రిక్ వల్ల గుండెలో మంట సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయితే, ఈ సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
గమనిక:
ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహా కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించండి.
Also read: Diarrhea After Eating Bananas: అరటిపండ్లు తిన్న వెంటనే మలవిసర్జన..కారణాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712