ఇంట్లో బల్లులు ( Lizard ) ఉంటే ఇంటికి మంచిదో లేదో అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. పొరపాటున వంట పదార్ధాల్లో, లేదా ఆహారంలో పడితే ఆనారోగ్యాలు కూడా కలగవచ్చు. అందుకే ఇంట్లో బల్లులను తరిమడానికి చాలా మంది పలు విధాలుగా కష్టపడుతుంటారు. ఈ టిప్స్ జీవన శైలిలో ( LifeStyle ) పాటించి వాళ్లు బల్లుల నుంచి ఇంటిని విముక్తి కలిగించవచ్చు. ఆరోగ్యవంతగా ( Health ) జీవించవచ్చు .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


IPL 2020 Sponsor: స్పాన్సర్ రేసులో దూసుకెళ్తున్న టాటా సస్స్


* మొక్కల చుట్టు బల్లులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. కోడి గుడ్డు పెంకులను ఆ మొక్కల దగ్గర పెట్టాలి. బల్లులు అటువైపు వెళ్లవు.


* వెల్లుల్లి వాసన బల్లులకు పడదు. వాటిని దంచి బల్లులు తిరిగే దగ్గర పెట్టాలి.


* ఉల్లిపాయ రసం కూడా బల్లులకు నచ్చదట.



16000 అడుగులు ఎత్తులో జాతీయ పతాక ఆవిష్కరణ


* ఇంట్లో బల్లి కనిపిస్తే దానిపై చల్ల ని నీరు పోయండి. అది కిందపడిపోతుంది. తరువాత దాన్ని బయటికి పంపించడం సులువు.


* మిరియాల వాసన బల్లులకు పడదు. అందుకే మిరియాపొడి దంచి పెట్టవచ్చ. పెప్పర్ స్ప్రే కూడా వాడవచ్చు.


* మిరియాలు( పెప్పర్ స్ప్రే).. మిరియాలు దంచి పెట్టినా.. లేదా పెప్పర్ స్ప్రే చల్లినా బల్లులు పోతాయట. వాటిని దాని ఘాటు వాసన తట్టుకోలేవట.


* బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో కర్పూరం పొడి చేసి చల్లండి. 


*  నెమలి ఈకను పెట్టడం వల్ల కూడా బల్లులను తరిమి కొట్టవచ్చు.


 


Healh Tips: బెల్లం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?