Winter Skin Care Tips: చలికాలంలో స్కిన్‌ను కాపాడే చిన్న టిప్స్.. ఓ లుక్కేయండి
Winter care: చలికాలం చర్మ సంరక్షణ పెద్ద సవాలుగా మారుతుంది. పొడి చర్మం , ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు చలికాలంలో సర్వసాధారణం. మరి వీటన్నిటి నుంచి చర్మాన్ని సహజంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..
Winter skin care: సీజన్స్ మారే కొద్ది క్లైమేట్ లో వచ్చే చేంజెస్ కారణంగా.. పొల్యూషన్ కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మన చర్మం. పైగా వచ్చేది చలికాలం కాబట్టి ఇన్ఫెక్షన్స్ బెడద మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా చర్మం పొడిగా మారడం, ముఖం పై ఇన్ఫెక్షన్స్ వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. చలి పెరిగే కొద్దీ ఈ సమస్య మరింత జటిలంగా మారుతుంది. అయితే ఇంటి వద్ద సులభమైన చిట్కాలను ఉపయోగించి ఇటువంటి ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు.
చలికాలం చర్మ సంరక్షణ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. మన వంటింటిలో లభించే ఔషధాలను ఉపయోగించి ఇటువంటి సమస్యలను దూరం పెట్టడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. మరి చలికాలంలో పాటించాల్సిన ఆ చిన్ని పార్టీ బ్యూటీ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..
చలికాలం చాలామంది శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవడం విస్మరిస్తారు. ఎప్పుడైతే మన శరీరంలో తేమశాతం తగ్గుతుందో చర్మం పొడిబారిపోవడంతో పాటు చర్మంపై తెల్లటి పొట్టు ఏర్పడుతుంది. అందుకే చలికాలంలో తప్పనిసరిగా రోజుకు మూడు లీటర్ల నీటిని తీసుకోవడం మర్చిపోకూడదు. చర్మం హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల పలు రకాల చర్మ సమస్యలు దూరంగా ఉంటాయి. ఈ కాలంలో చెమట ఎక్కువ పట్టదు.. కాబట్టి మన స్వేద గ్రంధులలో దుమ్ము పేరుకొని.. మొటిమలు ఏర్పడే అవకాశం ఉంది.
రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి స్టీమ్ పెట్టుకోవడం మర్చిపోకూడదు. ఇలా చేయడం వల్ల స్కిన్ ఫ్రెష్ గా ఉండడమే కాకుండా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. చలికాలం కంపల్సరిగా పొద్దున స్నానానికి ముందు కాస్త కొబ్బరి నూనెతో ముఖము, కాళ్లు, చేతులు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండి లేక బాడీ స్క్రబ్ ఉపయోగించి స్నానం చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. రోజు స్నానం చేసే నీటిలో కాస్త పసుపు కలుపుకోవడం వల్ల శరీరం పై ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కానీ వారంలో కనీసం రెండుసార్లు అయినా వేడి నీటిలో కాస్త ఉప్పు నిమ్మరసం వేసి పాదాలను ఒక 15 నిమిషాల పాటు ఆ నీటిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉంటుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. మీరు ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also read: Diabetes Control Tips: బ్లడ్ షుగర్ స్పైక్ నిరోధించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook