Diabetes Control Tips: మధుమేహం అనేది చాలా ప్రమాదకరం. ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇది. ఒకసారి సోకిందంటే ఇక నియంత్రణ ఒక్కటే మన చేతుల్లో ఉంటుంది. లైఫ్‌స్టైల్ మార్చుకోవడం ద్వారానే మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చు. మధుమేహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచకపోతే ఆరోగ్యం విషమిస్తుంది.
డయాబెటిక్ రోగులు ఆకస్మిక స్పైక్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉన్నట్టుండి ఒక్కసారిగా మధుమేహం అదుపు తప్పుతుంటుంది. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి ఆరోగ్యం విషమిస్తుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండటం మంచిది. డయాబెటిక్ రోగులకు రోజువారీ జీవితం చాలా కష్టతరంగా ఉండవచ్చు. ఎందుకంటే రోజూ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తుండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదకరంగా మారవచ్చు. చిన్న చిన్న పొరపాట్లు కూడా భారీ మూల్యం చెల్లించుకోవల్సివచ్చేలా చేస్తాయి. వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యం పాడవుతుంటుంది. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు సడెన్ స్పైక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. వీటివల్ల బ్లడ్ షుగర్ వేగంగా పెరుగుతుంది. జీఐ ఏయే పదార్దాలకు తక్కువగా ఉంటుంది, వేటికి ఎక్కువగా ఉంటుందనే వివరాలు తెలుసుకోవాలి. తినే డైట్ దాని ప్రకారం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రోసెస్డ్ ఫుడ్ తినకూడదు. ప్యాక్డ్ మీట్, కెచప్, కార్న్‌ఫ్లెక్స్, బిస్కట్స్ వంటివాటిలో హిడెన్ షుగర్ చాలా ఉంటుంది. ఇవి అనారోగ్యం కల్గించడమే కాకుండా ఎడిక్షన్ అయ్యేట్టు చేస్తాయి. అందుకే బయటి ఫుడ్స్ ముఖ్యంగా ప్యాకెట్ ఫుడ్స్ దూరంగా పెట్టాలి. అకారణంగా షుగర్, సాల్ట్ పదార్ధాలకు దూరంగా ఉండాలి.
ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ రోగులకు మేలు చేకూరుస్తుంది. ఫైబర్ ఆధారిత ఆహార పదార్ధాలు తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇంటెస్టైన్ ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, సీడ్స్ డైట్‌లో ఉంటే మంచిది.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. శారీరక, మానసిక ఆరోగ్యం ఉండాలంటే రోజూ వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మధుమేహం వ్యాధిని నియంత్రించేందుకు వ్యాయామం చాలా అవసరం. బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. డయాబెటిస్ రోగులు రోజూ వాకింగ్, జాగింగ్ లేదా యోగా చేయడం చాలా మంచిది.
Also read: BP Precautions: సైలెంట్ కిల్లర్‌గా ప్రాణాలు తీసే బీపీతో జాగ్రత్త, ఈ అలవాట్లు మార్చుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook