International Dance Day: ఇవాళ డ్యాన్స్‌కు పుట్టినరోజు కాదు గానీ..అంతర్జాతీయంగా డ్యాన్స్ డే జరుపుకునే రోజు. విషింగ్ యు ఎ హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. డ్యాన్స్ అనేది ఆహ్లాదాన్నే కాదు ఆరోగ్యాన్నిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా ఏప్రిల్ 29 న ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే జరుపుకుంటుంటాం.  డ్యాన్స్ కళను సెలెబ్రేట్ చేసుకునేందుకు అద్భుతమైన వేదిక. ఇవాళ ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచ డ్యాన్స్ డే సందర్భంగా..డ్యాన్స్ ఆరోగ్యాన్ని ఎలా పెంచుతుంది, మానసికంగా స్థిరత్వాన్ని ఎలా కలిగిస్తుందనేది పరిశీలిద్దాం..


డ్యాన్స్ అనేది నిజంగానే ఓ అద్భుతమైన ఫిట్నెస్ ప్రక్రియ. భారీ బరువులు ఎత్తలేకున్నా..నొప్పితో కూడిన స్ట్రెచెస్ చేయలేకపోయినా డ్యాన్స్ అనేది పూర్తి ఫన్‌తో కూడిన ఒక మంచి ఎక్సర్‌సైజ్. ఫిజికల్ ఫిట్నెస్  మాత్రమే కాకుండా డ్యాన్స్ ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కూడా కల్గిస్తుంది. మీ మూడ్‌ను తక్షణం మార్చేది, మీకు పూర్తిగా మనశ్సాంతినిచ్చేది కూడా ఇదే. అందుకే ప్రతియేటా ఏప్రిల్ 29న అంతర్జాతీయ డ్యాన్స్ డే నిర్వహించుకుంటూ..డ్యాన్స్ కళను కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా మిమ్మల్ని ఆరగ్యంగా మానసికకంగా స్థిరంగా ఉంచేందుకు డ్యాన్స్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..


గుండెకు మంచిది


డ్యాన్స్ అనేది అద్భుతమైన కార్డియో వర్కవుట్ అని మీలో అందరకీ తెలిసుంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా డ్యాన్స్ చేస్తే..హార్ట్ బ్యాలెన్స్ చేయడమే కాకుండా హార్ట్ రేట్ తగ్గిస్తూ..కొలెస్ట్రాల్ నిర్మూలిస్తుంది. వారానికి 3-4 సార్లు అరగంటకు పైగా డ్యాన్స్ చేస్తే మీ స్టామినా, శ్వాస పెరగడమే కాకుండా..మెరుగైన ఆరోగ్యాన్నిస్తుంది. మీకు నచ్చిన సంగీతం వింటూ డ్యాన్స్ చేయడాన్ని మించిన ప్రత్యామ్నాయం వేరొకటి లేదు. మీకు ఒత్తిడి ఎక్కువగా ఉన్నా లేదా టెన్షన్ పడుతున్నా..మీకు నచ్చిన సంగీతం వింటూ డ్యాన్స్ అలవాటు చేసుకోండి.  ఇలా చేస్తే స్ట్రెస్, టెన్షన్ రెండూ దూరమౌతాయి.


బరువు తగ్గడంలో..


జుంబా, ఏరోబిక్స్, సల్సా వంటివన్నీ డ్యాన్స్ ప్రక్రియలే. ఇవి ఆహ్లాదంగా ఉంటూన మంచి ఎక్సర్ సైజెస్‌గా దోహదపడతాయి. డ్యాన్స్‌లో ఉండే మూమెంట్స్ కారణంగా చెమట ఎక్కువగా పడుతుంది. అది బరువు తగ్గేందుకు కారణమవుతుంది.


Also read: Drumstick Benefits: మునగను 'ఆయుర్వేద అమృతం' అని ఎందుకు అంటారు? నిజంగా మునగతో అన్ని ప్రయోజనాలు ఉన్నాయా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.