Toothache Home Remedies: ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది పంటి నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. కాల్షియం లేకపోవడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, జ్ఞాన దంతాలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైనవి సమస్యలు ఉత్పన్నం కావడం. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. పంటి నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ ఇంటి వస్తువులతో పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందండి:


1. లవంగం:


పంటి నొప్పికి లవంగం చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ పరిహారాన్ని శతాబ్దాలు క్రితమే ఆయుర్వేద శాస్త్రంలో కొనుగొన్నారు. లవంగం కూడా ఓ ఆయుర్వేద ఔషధంగా పరిగణించారు. దంత సమస్యల ఉంటే.. రెండు మూడు లవంగాలను తీసుకుని కొద్దిగా దంచి పంటి కింద ఉంచితే ఉపశమనం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.


2. ఇంగువ :


ఇంగువ పంటి నొప్పికి బెస్ట్ రెసిపీగా చెప్పవచ్చు. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రెండు నుంచి మూడు చిటికెల ఇంగువలో రెండు నుంచి నాలుగు చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి, ఆ పేస్ట్‌ను దంతాలఊకు మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది.


3. రాక్ సాల్ట్:


ఉప్పు అనేక వ్యాధులకు ఔషధమని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు.  పంటి నొప్పిని విముక్తి పొందడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పును కలిపి, ఆపై ఆ నీటితో దంతాలను శుభ్రం చేసుకోండి. రోజుకు కనీసం రెండు మూడు సార్లు పుక్కిలించడం వల్ల ఉపశమనం లభిస్తుంది.


4. ఉల్లిపాయ:


పంటి నొప్పి సమస్యతో బాధపడతుంటే.. ఉల్లిపాయలను వినియోగించి ఉపశమనం పొందవచ్చని శాస్త్రంలో పేర్కొన్నారు. దీని కోసం, ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి నొప్పి ఉన్న వైపు ఉంచి బాగా నమలండి. దీని వల్ల త్వరలోనే ఉపశమనం లభిస్తుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.