Mosquito Control: దోమల వల్ల ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఇలా చేసి చూడండి!
Mosquito Control | దోమ..అది కేవలం 0.125 నుంచి 0.75 ఇంచులు మాత్రమే ఉంటుంది. కానీ ఆరడుగుల ఆజానుబాహుడికి సైతం చుక్కలు చూపిస్తుంది.
Tips To Control Mosquitoes | దోమ..అది కేవలం 0.125 నుంచి 0.75 ఇంచులు మాత్రమే ఉంటుంది. కానీ ఆరడుగుల ఆజానుబాహుడికి సైతం చుక్కలు చూపిస్తుంది. ఒక్క దోమ ( Mosquito) వల్ల రాత్రంతా ఇబ్బంది పడి ఉదయం పని చేయడానికి ఇబ్బంది పడే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.
ALSO READ| Health: జీలకర్రతో ఆరోగ్యం మరింత పదిలం
దోమల నుంచి తప్పించుకోవడానికి మార్కెట్లో లభించే కాయిల్స్, పేపర్లు, బాడీ క్రీమ్స్ ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొన్ని సార్లు ప్రయోజనం కనిపించదు.
దోమ జీవిత కాలం 2 వారాల నుంచి 6 నెలలు ఉంటుంది. నీరు పోగైన ప్రాంతాల్లో దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే నీరు ( Water ) పోగు కాకుండా చూసుకోవాలి. ఖాళీ టైర్లు, బకెట్లు, గుంటల్లో నీరు చేరుకుండా చూసుకోవాలి. చేరినా తొలిగించాలి. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా దోమలు పోవడం లేదా .. అయితే ఈ టిప్స్ పాటించండి. ఆరోగ్యాన్ని ( Health ) కాపాడుకోండి.
1.వెల్లుల్లి | Garlic
వెల్లుల్లి ఉన్న చోటు దోమలు ఉండవు. ఎందుకంటే వెల్లుల్లి ఘాటు వాసన దోమలకు పడవు. అందుకే వెల్లుల్లిని చిన్ని చిన్ని ముక్కలుగా చేసి దోమలు ఎక్కువగా ఉన్న చోటు పెడితే సరిపోతుంది.
2. వేప | Neem
వేప ఆకులను వాడి కూడా దోమల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిదల్లా ముందు వేప నూనె, కొబ్బరి నూనెను సమానంగా మిక్స్ చేసి ఆ లిక్విడ్ ను చర్మంపై అప్లై చేయండి. ఆ వాసనకు దోమలు రావు.
3. కర్పూరం | Karpoor
కర్పూర వాసనతో దోమలు పారిపోతాయి అని తెలిసిందే. అయితే బిర్యానీ ఆకులతో కలిపి కర్పూరాన్ని కాల్చితే ఆ వాసనకు దోమలు రావు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR