Bad Breath: నోటి దుర్వాసనను తేలికగా తీసుకోకండి

నోటి దుర్వాసనను ( Bad Breath) లైట్ గా తీసుకుంటున్నారా ? అలా చేయకండి. 

Last Updated : Aug 31, 2020, 05:46 PM IST
    • నోటి దుర్వాసనను లైట్ గా తీసుకుంటున్నారా ? అలా చేయకండి.
    • ఎందుకంటే నిపుణల ప్రకారం నోటి దుర్వాసన అనేది పలు రోగాలకు కారణం అవ్వవచ్చు.
    • మీరు కూడా నోటి దుర్వాసన వల్ల ఇబ్బంవది పడుతోంటే వెంటనే దీని ఫోకస్ పెట్టడం ప్రారంభించండి.
Bad Breath: నోటి దుర్వాసనను తేలికగా తీసుకోకండి

నోటి దుర్వాసనను ( Bad Breath ) లైట్ గా తీసుకుంటున్నారా ? అలా చేయకండి. ఎందుకంటే నిపుణల ప్రకారం నోటి దుర్వాసన అనేది పలు రోగాలకు కారణం అవ్వవచ్చు. మీరు కూడా నోటి దుర్వాసన వల్ల ఇబ్బంవది పడుతోంటే వెంటనే దీని ఫోకస్ పెట్టడం ప్రారంభించండి.నోటి దుర్వాసక కలగడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి.

నోటి ఇన్ఫెక్షన్స్ దీనికి ప్రాధాన కారణం. దీంతో పాటు పాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నోరు ఎండిపోవడం వల్ల ఇలా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ( Health ) జీవితం కోసం ఫాస్ట్ ఫుడ్ ను దూరంగా పెట్టడం మంచిది. దీని వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.

స్మోకింగ్ ( Smoking ) చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయం అందరికీ తెలిసిందే.  దాంతో పాటు స్మోకింగ్ చేయడం వల్ల నోటి దుర్వాసన పెరుగుతుంది. స్మోకింగ్ నోటిని ఎండిపోయేలా చేస్తుంది. ఇలా నోటి దుర్వాసన వల్లే దాని వల్ల సైనస్, నోటి, గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. శ్వాస సంబంధిత వ్యాధులు కూడా కలిగే అవకాశం కూడా ఉంది. 

దీని కోసం చేయాల్సినవి
శరీరంలో తగిన మోతాదులో నీరు ( Water ) లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం కూడా ఉంది. జీర్ణక్రియపై కూడా ప్రభావం కలుగుతుంది. అందుకే ప్రతీ రోజు కావాల్సినంత నీరు తీసుకోండి.

 

Trending News