Top 5 Black Cumin Benefits: చాలామంది వివిధ రకాల వంటకాలు జీలకర్రను వినియోగిస్తూ ఉంటారు.. ఎప్పుడు ఒకే రంగుతో కూడిన జీలకర్రను చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా నల్ల రంగులో ఉండే జీలకర్రను చూశారా? ఆయుర్వేద శాస్త్రం పరంగా నల్ల జీలకర్రకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన ఈ జీలకర్రను వివిధ రకాల మందులు తయారీలో కూడా వినియోగిస్తారట. ఇందులో ఉండే మూలకాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు ఎంతగానో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో నల్ల జీలకర్రను చేదు జీలకర్రగా కూడా పిలుస్తారు. ఈ నల్ల జీలకర్ర లో ఉండే కొన్ని రసాయనిక పదార్థాలు పొట్ట ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. దీని కారణంగా ఎలాంటి పొట్ట సమస్యలైనా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా నల్ల జీలకర్రను వినియోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన పూర్వీకులు ఎక్కువగా నల్ల జీలకర్రను ఆహారాల్లో వినియోగించేవారట. అందుకే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉన్నారని కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి నల్ల జీలకర్రతో తయారుచేసిన నీటిని తాగడం వల్ల కూడా విశేషమైన లాభాలు కలుగుతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీవైరస్ లక్షణాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఈ నల్ల జీలకర్రను ఆహారాల్లో వినియోగించడం వల్ల అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి రోజు దీనితో తయారుచేసిన నీటిని తాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లేకపోవడం వంటి సమస్యల నుంచి సులభంగా విముక్తి పొందవచ్చు. దీంతోపాటు మూత్రపిండాల సమస్యలు కూడా రాకుండా ఉంటాయని కొంతమంది ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 


ప్రతిరోజు నల్ల జీలకర్రను ఆహారాల్లో తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా తరచుగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా నల్ల జీలకర్రను ఆహారాల్లో తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు కాలేయ సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. అలాగే శరీరంలో కొవ్వును కరిగించేందుకు కూడా ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రోజు ఖాళీ కడుపుతో ఉదయాన్నే నల్ల జీలకర్రతో తయారుచేసిన నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే ఈ నీటిని తాగితే చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. 


ముఖ్యంగా ప్రతిరోజు నల్ల జీలకర్రను ఆహారాల్లో వినియోగిస్తే నొప్పులు, వాపులు రాకుండా కూడా ఉంటాయట. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా విముక్తి కల్పించేందుకు కూడా నల్ల జీలకర్ర కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం చాలామంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా ఈ జీలకర్ర ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెంచి అన్ని రకాల వ్యాధులనుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజు గోరువెచ్చని ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పరిగడుపున తాగండి. అయితే గర్భిణీ స్త్రీలు ఈ నీటిని తాగే ముందు తప్పకుండా వైద్యుల సూచనల సలహాల మేరకే తాగాలని నిపుణులు చెబుతున్నారు.


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.