Anti Aging Foods: వృద్ధాప్య ప్రక్రియ అనేది ప్రతీ వ్యక్తిలో బిన్నంగా ఉంటుంది. కాని కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన చర్మం యొక్క యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ప్రస్థుత జీవన శైలిని మార్చుకోవడం చేయవలిసిన మొదటి పని పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం పూర్తిగా మానుకోవాలి. ఎక్కువగా సేంద్రీయ ఆహరం మాత్రమే తీసుకోవడం వలన చర్మం యవ్వనంగా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవకాడో
అవకాడోలో మోనో అన్ సాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వు ధమనులలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అవకాడోలో విటమిన్ E ఉంటుంది, మరియు ఇది ఒక ప్రతిక్షకారినిగా కూడా పని చేస్తుంది. అందువలన చర్మం మృదువుగా మారి చర్మం యొక్క తేమని పెంచుతుంది. 


Also Read: Viral Video: ఈడు మగాడ్రా బుజ్జి.. 'పడగ విప్పిన పాముకు ముద్దు'.. వహ్!


క్యారెట్లు
క్యారెట్లలో చాలా వరకు  బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది మరియు శరీర నిర్విశీకరణకు తోడ్పడుతుంది. స్టాప్ ఏజింగ్ నౌ (Stop Aging Now) అనే పుస్తకంలో ఉన్న ఒక పరిశోధన ద్వారా తేలిన విషయం ఏమిటంటే క్యారేట్లలో ఉండే బీటా కెరోటిన్ ఒక ప్రతిక్షకారినిగా పని చేయడం వలన చర్మం యొక్క వయసుతో పాటు చర్మ వ్యాధుల నుండి కుడా కాపాడుతుంది. నారింజ వర్ణ ద్రవ్యం ఉండడం వలన వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


దోసకాయ
దోసకాయ కణ పునరుత్పత్తికి చాలా దోహదపడుతుంది. దోసకాయతో నేరుగా మొహం కూడా కడగవచ్చు. దోసకాయ ముక్కలతో కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలని నిర్మూలించవచ్చు. దోసకాయలో ఉండే సిలికా వలన కండరాలు, మృదులాస్థి మరియు ఎముకల వృద్దికి తోడ్పడుతుంది. అంతేకాకుండా చర్మం యొక్క నిగారింపుకి సహాయపడుతుంది. దోసకాయలలో పొటాషియం అయాన్, విటమిన్ C మరియు మెగ్నీషియం ఉండడం వలన శరీరం పై క్షారీయ ప్రభావం చూపించి ఆరోగ్యవంతంగా మార్చుతుంది.


Also Read: Bank Holidays in November: న‌వంబ‌ర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులంటా.. ?


బెర్రీలు
బ్లాక్ బెర్రీలు మరియు బ్లూ బెర్రీలు ఫ్లావనాయిడ్స్ ని కలిగి ఉంటాయి. అది శక్తివంతమైన ప్రతిక్షకారిని. బెర్రీలు తినడం ద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనలో బ్లాక్ బెర్రీ మరియు బ్లూ బెర్రీలు శక్తివంతమయిన ప్రతిక్షకారిని అని తేలింది.


కూరగాయలు
కాలిఫ్లవర్, గ్రీన్ కాలిఫ్లవర్ మరియు క్యాబేజీ వంటి కూరగాయలు చర్మ రక్షణకి తోడ్పడుతాయి. ఇవి చర్మ క్యాన్సర్ నుంచి కాపాడి చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ కురగాయలు వివిధ హార్మోన్ల స్థాయిలను సమానంగా నిర్వహించడం గమనించారు.


మంచి ఫలితాల కోసం మరి కొన్ని చిట్కాలు:
1) మీరు కొనే కూరగాయలు మరియు పండ్లు రసాయనిక ఎరువులతో పెరుగుతాయి కనుక వాటిని వండే ముందు లేక తినే ముందు శుభ్రంగా చల్లని నీటిలో కడిగి తినాలి.


2) క్యారెట్లు, ఆలుగడ్డ వంటి కూరగాయల తోలు తీసేసి తినడం ఆరోగ్యకరమయినది. ఎందుకంటే వాటి మీద పురుగుల మందులు చల్లబడి ఉంది ప్రమాదం ఉంది.


3) మీరు వేటినైనా కొనే ముందు పి యల్ యు స్టికర్ చూసి కొనండి. సంప్రదాయ పద్ధతిలో పెరిగిన ఉత్పత్తుల పై నాలుగు అంకెల సంఖ్య ఉంటుంది. ఒక వేల ఐదు అంకెల సంఖ్య ఉన్నట్లయితే అవి రసాయనిక పద్ధతిలో పెరిగాయి అని గుర్తుంచుకోవాలి.


Also Read: AP State Formation Day: తెలుగులో ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ


4) పైనాపిల్, నారింజపండు, పుచ్చకాయలు తినే ముందు శుభ్రంగా కడగాలి. ఎందుకంటే వాటిని ముక్కలుగా చేసే సమయంలో తొక్క పైన ఉండే కలుషితాలు గుజ్జు మీదకి చేరవచ్చు.


5) ముక్కలుగా చేసిన కూరగాయలు మీరు తిననపుడు వాటిని మీ ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన అవి బాక్టీరియాల నుంచి రక్షించబడతాయి.


6) కూరగాయలని ఎక్కువ కాలం నిలువ చేసినట్లయితే వాటి నుంచి ఈతిలీన్ వాయువు విడుదల అయి కూరగాయలు క్రుళ్ళిపోయేలా చేస్తాయి.


7) కూరగాయలు చల్లటి ప్రదేశంలో ఉంచడం మరవద్దు. వేడికి అవి త్వరగా నిర్జలీకరించబడతాయి. వాటి వలన క్రిమికీటకాలు చేరి అనారోగ్యానికి దారి తీస్తాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి