DIY Mask: ఈ మాస్క్ వేస్తే పెచ్చులు పెచ్చులుగా ఉన్న చుండ్రు కూడా రాలిపోవాల్సిందే..
DIY Curd Hair Mask: పెరుగును ఇలా ఉపయోగించడం వల్ల తలపై పేరుకున్న చుండ్రు ఒక్కసారిగా రాలిపోతుంది. ఎందుకంటే పెరుగులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కుదుళ్ల ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది.
DIY Curd Hair Mask: పెరుగు మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే, పెరుగును సౌందర్యపరంగా కూడా రకరకాలుగా ఉపయోగిస్తారు. పెరుగులో మాయిశ్చర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును మృదువుటా మారుస్తుంది.
పెరుగును ఇలా ఉపయోగించడం వల్ల తలపై పేరుకున్న చుండ్రు ఒక్కసారిగా రాలిపోతుంది. ఎందుకంటే పెరుగులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కుదుళ్ల ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఫోలికల్ పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. పెరుగులో మన జుట్టుకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్‌ను తొలగిస్తుంది. దీంతో మీ జుట్టు చుండ్రు లేకుండా బలంగా పెరుగుతుంది. పెరుగుతో జుట్టును మందంగా పొడుగ్గా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
పెరుగు ముల్తాని మిట్టి..
పెరుగు, ముల్తానీ మిట్టిని మీ జుట్టుకు సరిపోయేంత కలుపుకోవాలి. ఈ ప్యాక్‌ను జుట్టు కుదుళ్లనుంచి చివర్ల వరకు మాస్క్ వేసుకోవాలి. ఆ తర్వాత ఓ అరగంట పాటు జుట్టును ఆరనివ్వాలి. సాధారణ నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఎవరీ సుల్తాన్? 7000 పైగా కార్లు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్ ఉన్న కింగ్.. నేడు మోదీకి ఆతిథ్యం..
ఉసిరి పొడి..
పెరుగు, ఉసిరి పొడితో కూడా జుట్టుకు మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ రెండిటినీ కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఓ అరగంట పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ నీటితో జుట్టును కడగాలి.
కొబ్బరి నూనె..
ఈ రెండిటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. ఓ అరగంటపాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. కొబ్బరి నూనెతో జుట్టు సమస్యలు సత్వరమే తొలగిపోతాయి.
పెరుగు తేనె..
పెరుగు తేనె మిక్స్ చేసి కూడా పేస్ట్ తయారు చేసుకోవచ్చు. దీంతో పొడిబారిన జుట్టు అందంగా మారిపోతుంది. ఈ రెండిటినీ కలిపి మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవాలి. దీన్ని జుట్టంతటికీ పట్టించి ఓ 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 1000 లోపు అందుబాటులో ఉన్న 300 రోజుల వ్యాలిడిటీ రీఛార్జీ ప్లాన్..
మెంతులు..
మెంతుల్లో కూడా జుట్టుకు మంచి పోషణ అందించే గుణం కలిగి ఉంటుంది. పెరుగుతో మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం దీన్ని పేస్ట్ మాదిరి బాగా రుబ్బుకోవాలి. దీన్ని జుట్టు అంతటికీ పట్టించి బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter