Vastu: మన వంటింట్లో ఉన్న వస్తువులలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అన్న విషయం మనకు తెలుసు. అయితే వాటి వల్ల మనకు పట్టిపీడిస్తున్న పీడలను కూడా వదిలించుకోవడం కుదురుతుంది అని చాలామందికి తెలియదు. అలా అన్ని రకాలుగా పనికొచ్చే వస్తువు పసుపు. ఆయుర్వేదం నిపుణులు పసుపును పలు రకాల అనారోగ్య సమస్యలు నివారించడానికి ఉపయోగించేవారట. మనం కూడా చిన్న దెబ్బల దగ్గర నుంచి చాలా వాటికి పసుపుతో చిట్కా వైద్యం చేస్తూనే ఉంటాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సౌందర్యానికి ,సౌభాగ్యానికి చిహ్నంగా భావించే పసుపు ఐశ్వర్యానికి కూడా చిహ్నం అని మీకు తెలుసా? ఇంట్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పసుపుతో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. ఇక లైఫ్ లో దేనికి కొరత ఉండదు. మనం ఎంత సంపాదించినా సరే ఆయన ఖర్చులు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఎక్కడి సంపాదన సరిపోదు. అలాగని ఏ ఖర్చు అవసరం ,ఏ ఖర్చు అనవసరం అని బెరీజు వేసుకోవడం కూడా చాలాసార్లు కుదరదు. ఇలా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎరుపు రంగు వస్త్రంలో పసుపు ముద్దను మూట కట్టి లాకర్ లో ఉంచాలి.


ఇలా చేయడం వల్ల మన లైఫ్ లో అనవసరపు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయట. అయితే పసుపు ముద్ద తడిగా ఉన్నప్పుడు లాకర్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ముందుగా పసుపు ముద్దను ఎర్రగుడ్డలో పెట్టి పూజా మందిరంలో ఉంచండి.. పసుపు ముద్ద బాగా గట్టిపడిన తర్వాత వస్త్రానికి ముడివేసి లాకర్లో పెట్టుకోండి. లేకపోతే లాకర్ లోపల బూజు పడుతుంది. ఈ పసుపు ముద్దను లాకర్ యొక్క ఈశాన్య దిశలో ఉంచాలి.


ఇలా పసుపు ముద్ద లాకర్లో ఉంచినప్పుడు నర దిష్టి చాలా వరకు తగ్గుతుంది. మీరు సంపాదించే మార్గాలు కూడా  ఎక్కువవుతాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పసుపు నీటిని ఇల్లంతా చిలకరించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగడమే కాక ఇంటికి నర దిష్టి ఉండదు. తరచూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ప్రతిరోజు పూజకి ముందు పసుపు నీళ్లు ఇల్లంతా చల్లుకోవడం ఎంతో మంచిది. అలాగే శుక్రవారం పూట వీలైనంత వరకు పసుపు బట్టలను ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వండి.


గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.


Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?


 


Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి