Tulsi Leaves: చలికాలం ఇది తాగితే.. ఎంతటి విష జ్వరమైనా తగ్గడం ఖాయం!
Tulsi Leaves Decoction Benefits: తులసి ఆకుల డికాషన్ చలికాలం రోజు తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే జ్వరాన్ని కూడా తగ్గిస్తాయి.
Tulsi Leaves Decoction Benefits In Telugu: తులసి ఆకులతో తయారు చేసిన డికాషన్ రోజు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి చలికాలంలో ఈ డ్రింక్‌ను రోజు ఉదయం తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చలికాలంలో తులసి ఆకుల డికాషన్ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
తులసి ఆకుల డికాషన్ ప్రయోజనాలు:
రోగ నిరోధక శక్తి :
తులసి ఆకుల్లో ఔషధ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి ఈ ఆకులతో చేసిన డికాషన్ రోజు తాగితే శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని కారణంగా చలి వల్ల వచ్చే వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
జీర్ణ సమస్యల నివారణకు:
తులసి ఆకులు డికాషన్ రోజు ఉదయాన్నే తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా జీర్ణకోశ సమస్యలు సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపున్నారు. అలాగే మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
జ్వరాన్ని తగ్గిస్తుంది:
తులసి ఆకుల డికాషన్‌లో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు జ్వరాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా సాధారణ జ్వరాన్ని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలను తగ్గించేందుకు కూడా తులసి డికాషన్ ప్రభావవంతంగా సహాయపడుతుంది.
శ్వాసకోశ సమస్యలకు..:
తులసి ఆకులతో చేసిన డికాషన్ రోజు తాగడం వల్ల ఉబ్బసం, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఇది శ్వాస మార్గాలను శుభ్రపరిచేందుకు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
గుండె ఆరోగ్యానికి:
తులసి ఆకులు రక్తపోటును నియంత్రించేందుకు కూడా ఎంతో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీనిని డికాషన్‌లా తయారు చేసుకుని తాగడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గుతుంది. అంతేకాకుండా గుండె కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.