Turmeric Hair Benefits: పసుపు మన జుట్టుకు ఒక వరం..ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
Turmeric Hair Benefits: పసుపు మన వంట గదిలో కచ్చితంగా ఉండే వస్తువు దీంట్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. దీని వంటల్లో వాడుతాం పసుపు మన ముఖానికి గ్లోయింగ్ అందిస్తుంది. అంతేకాదు ఇది బెటర్ డైజెషన్ కూడా తోడ్పడుతుంది
Turmeric Hair Benefits: పసుపు మన వంట గదిలో కచ్చితంగా ఉండే వస్తువు దీంట్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. దీని వంటల్లో వాడుతాం పసుపు మన ముఖానికి గ్లోయింగ్ అందిస్తుంది. అంతేకాదు ఇది బెటర్ డైజెషన్ కూడా తోడ్పడుతుంది. పసుపుతో జుట్టు కూడా ఆరోగ్యంగా పెంచుతుంది. దీంతో అయిదు ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు సైంటిఫిక్ నేమ్ కరకుమా లొంగ ఇది జింజర్ రూట్ ఫ్యామిలీకి చెందింది ఏళ్లుగా పసుపును ఆయుర్వేదిక్ లో కూడా విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే పసుపుతో జుట్టుకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుందాం.
హెయిర్ ఫాల్..
పసుపు హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీంతో కుదుళ్లను ఇన్ల్ఫమేషన్ కి గురికాకుండా కాపాడుతుంది. హెయిర్ ఫాల్ సమస్యను అధిగమిస్తుంది. 2021 ఆధ్యయనం ప్రకారం పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి ఫాల్ హెయిర్ ఫాల్ నివారిస్తుంది
దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది.
డాండ్రఫ్..
పసుపు మన జుట్టులో పేరుకున్న డాండ్రఫ్ ని కూడా చెక్ పెడుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కార్కుమిన్ ఫంగస్ కి వ్యతిరేకంగా పోరాడి డాండ్రఫ్ రాకుండా నివారిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు స్కాల్ప్ దురదను అధిగమిస్తాయి 2021 క్లినికల్ కాస్మెటిక్ ఇన్వెస్టిగేషనల్ డెర్మటాలజీ ప్రకారం ఇది సైంటిఫిక్ గా నిరూపితమైంది.
జుట్టు ఆరోగ్యం..
పసుపు ఫ్రీరాడికల్ సమస్య రాకుండా జుట్టుకి చర్మాన్ని కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పసుపు జుట్టు పై పేరుకున్న విష పదార్థాలను తొలగిస్తుంది. ఇది 2020 అధ్యాయంలో తేలింది.
మెరుగైన జుట్టు..
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే పసుపు మన జుట్టు పెరుగుదలకు మరింత మెరుగు చేస్తుంది. యాంటీ ఇన్ల్ఫమేటరీ మీ జుట్టు పాడవకుండా కాపాడుతుంది. పసుపుని మీ డైట్ లో కూడా చేర్చుకుని వాటి లాభాలు చూడండి.
జుట్టు పెరుగుదల..
కర్కుమిన్ హెయిర్ గ్రోత్ కి జుట్టు పెరుగుదలను హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్ఫ్ కు ప్రేరేపించే ప్రోత్సహిస్తాయి దీంతో బ్లడ్ సర్కులేషన్ మెరుగవుతుంది, ఇందులోని యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది అంతేకాదు పసుపులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కొల్లాజన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది దీంతో కుదుళ్ల నుంచి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
పసుపును ఏ విధంగా జుట్టుకు ఉపయోగించాలి?
జుట్టుకు పసుపును వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు దీంతో ఎఫెక్టివ్ రిజల్ట్స్ పొందుతారు అది ఎలాగో తెలుసుకుందాం
పసుపు హెయిర్ మాస్క్ తయారీ విధానం..
పసుపు 2 స్పూన్స్
ఆలివ్ ఆయిల్ 1స్పూను
పెరుగు 1స్పూను
ఇదీ చదవండి: వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లచల్లని స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్..
హెయిర్ ప్యాక్ తయారీ విధానం..
రెండు టేబుల్ స్పూన్ల పసుపులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా పేస్ట్ మాదిరి కలపాలి ఇది కుదులు నుంచి జుట్టు మొత్తం బాగా అప్లై చేసుకొని అరగంట తర్వాత మైల్డ్ షాంపూ నువ్వు ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఇదీ చదవండి: రాగిపిండితో ఈ ఫేస్‌ప్యాక్ వేసుకోండి.. మీ ముఖానికి రెట్టింపు కాంతి..
పసుపు షాంపూ తయారీ విధానం..
ఒక టేబుల్ స్పూన్ పసుపులో మీరు రెగ్యులర్ గా ఉపయోగించే షాంపును మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ పసుపు షాంపూను జుట్టు అంతా అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవాలి దీంతో జుట్టు సంబంధిత సమస్యలకు చెప్పి పెడతాయి(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook