Apple Health Benefits: యాపిల్ మనందరికీ తెలిసిన రుచికరమైన పండు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆపిల్‌ను పండిస్తారు. ఇవి చాలా రకాలుగా పండుతాయి. అంతేకాకుండా ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు కూడా ఉన్నాయి. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల  అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. యాపిల్‌ లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీని నేరుగా తినడమే కాకుండా జ్యూస్, జామ్, పైస్, కేక్‌లు తయారు చేసుకోవచ్చు. యాపిల్‌ తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు:


గుండె ఆరోగ్యం: 


యాపిల్‌లో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్ సి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.


బరువు నియంత్రణ: 


యాపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వేగంగా తృప్తి కలిగిస్తుంది, దీంతో అతిగా తినడం నిరుత్సాహపరుస్తుంది. తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.


జీర్ణ వ్యవస్థ: 


యాపిల్‌లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.


క్యాన్సర్ నిరోధకం: 


యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్‌కు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


చర్మ ఆరోగ్యం: 


యాపిల్‌లో ఉండే విటమిన్ సి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ముడతలు పడకుండా నిరోధిస్తుంది.


డయాబెటిస్‌ నియంత్రణ: 


యాపిల్‌లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.


దంతాలు ఆరోగ్యంగా ఉంచడం: 


యాపిల్ తినడం దంతాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. దంతాల ఎనామెల్‌ను బలపరుస్తుంది.


యాపిల్‌ను ఎలా తినవచ్చు:


తోలుతో సహా: యాపిల్‌లో అధికమైన ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు తోలులోనే ఉంటాయి. కాబట్టి తోలుతో సహా తింటే మరింత ఆరోగ్యకరం. ముఖ్యంగా ఆర్గానిక్ యాపిల్స్ ఉంటే తోలుతో సహా తినడం మంచిది. కానీ, యాపిల్‌ను బాగా కడిగి తీరాలి.


తోలు తీసి: కొంతమందికి తోలు రుచి నచ్చకపోవచ్చు. అలాంటి వారు తోలు తీసి తినవచ్చు.


ముక్కలుగా కోసి: యాపిల్‌ను ముక్కలుగా కోసి నేరుగా తినవచ్చు.


జ్యూస్ చేసి: యాపిల్‌ను జ్యూస్ చేసి తాగవచ్చు.


సలాడ్‌లో చేర్చి: సలాడ్‌లో యాపిల్ ముక్కలను చేర్చి తినవచ్చు.


పైస్, పుడ్డింగ్‌లు వంటి వాటిలో ఉపయోగించి: యాపిల్‌ను పైస్, పుడ్డింగ్‌లు వంటి వంటకాల్లో ఉపయోగించవచ్చు.


గమనిక: రోజూ యాపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అన్ని పండ్లలాగే యాపిల్‌ను మితంగా తీసుకోవడం మంచిది. ఎక్కువగా తింటే అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


Also read: Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter