Uric Acid Control: ఈ డ్రింక్స్‌తో యూరిక్ యాసిడ్ 5 రోజుల్లో మటు మాయం..
Uric Acid Control 5 Days: యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొత్తిమీర గింజలతో తయారు చేసిన నీటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి.
Uric Acid Control 5 Days: ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలు అతిగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగినప్పుడు, కిడ్నీ ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే పలు రకాల ఆహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్ సమస్యలు అధికంగా రావడం వల్ల కీళ్లలో గౌట్, వాపు నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలతో పాటు జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
వాము యూరిక్ యాసిడ్‌పై చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటిని మరిగించి.. అందులో వాము వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. ఇలా మరిగించి తీసుకున్న నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ ఇలా మరిగించిన నీటిని తాగడం వల్ల ఖాళీ కడుపుతో తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారు.
అయితే వాము నీటిలో అల్లం కూడా మరిగించి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలను తగ్గించడానికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని ఖాళీ కడుపుతో ప్రతి రోజూ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా తీవ్ర నొప్పులు కూడా దూరమవుతాయి.
ఇలాంటి చిట్కాలు కూడా సహాయపడతాయి:
కొత్తిమీర గింజలతో తయారు చేసిన డ్రింక్స్ తాగడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పొట్ట సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అధిక యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు అల్లంతో తయారు చేసిన డికాషన్ ఖాళీ కడుపుతో తాగడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మెంతి గింజలు కూడా యూరిక్ యాసిడ్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యలను తగ్గించడమేకాకుండా యూరిక్ యాసిడ్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ మెంతి గింజల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి
Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి