Hibiscus Oil: కొబ్బరి నూనెలో మందార పువ్వులు కలిపి పెట్టుకుంటే తెల్ల జుట్టుకు ఇక బైబై...
Hibiscus Oil For White Hair: తెల్ల జుట్టు. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఇక ఈ సమస్యలకు మందారం పువ్వుతో చెక్ పెట్టండి. దీని ప్రతిరోజు ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోండి.
Hibiscus Oil For White Hair: నేటికాలంలో జుట్టు రాలడం , తెల్ల జుట్టు, చుండ్రు, బట్ట తల వంటి సమస్యలు అతి చిన్న వసయసులోనే తలెత్తులన్నాయి. దీని కారణం జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఖరీదైనా హెయిర్ ప్రొడెక్ట్స్‌లకు గుడ్ బై చెప్పి ఈ సింపుల్ హోమ్ మేడ్ ఆయిల్‌ను తయారు చేసుకోండి. ఇది జుట్టును ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం కూడా. ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు తెలుసుకుందాం.
మందారం- కొబ్బరి నూనె హెయిర్ ఆయిల్:
మన పెరటిలో వివిధ రకాల మొక్కలు, పువ్వులు పెరుగుతాయి. అందులో మందారం పువ్వు ఒకటి. ఇది అద్భుతమైన సువాసన కలిగి ఉండటంతో పాటు బోలెడు ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మందారంతో తయారు చేసే నూనె అన్ని రకాల జుట్టు సమస్యలను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. దీని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభించే హానికరమైన రసాయనాల కంటే ఇది ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మందారం- కొబ్బరి నూనె తయారీ విధానం:
కావలసిన పదార్థాలు:
మందారం పువ్వులు - 10-15
కొబ్బరి నూనె - 1 కప్పు
కరివేపాకు - కొన్ని రెమ్మలు
మెంతులు - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
మందారం పువ్వులను శుభ్రంగా కడిగి, నీరు పిండి వేయండి. ఒక చిన్న కడాయిలో కొబ్బరి నూనె వేసి మంట మీద వేడి చేయండి. నూనె కాస్త వేడైన తర్వాత మందారం పువ్వులను వేసి నెమ్మది మంట మీద 5-7 నిమిషాలు వేయించండి. మీరు ఇష్టం వస్తే కరివేపాకు, మెంతులు వేసి కొద్ది సేపు వేయించవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి, నూనె చల్లారనివ్వండి. ఒక గుడ్డను ఉపయోగించి నూనెను మందారం పువ్వుల నుంచి వేరు చేయండి. చల్లారిన నూనెను ఒక గాజు బాటిల్ లో నిల్వ చేయండి.
ఉపయోగించే విధానం:
తలకు నూనె మర్దన చేసి, ఒక గంట పాటు ఉంచండి.
ఆ తరువాత మిల్డ్ షాంపూతో తల స్నానం చేయండి.
వారానికి రెండు సార్లు ఈ నూనెను ఉపయోగించవచ్చు.
ఇతర చిట్కాలు:
మందారం పువ్వుల బదులు మందారం ఆకులను కూడా ఉపయోగించవచ్చు.
ఈ నూనెను చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు.
తాజా మందారం పువ్వులు ఉపయోగించడం మంచిది.
Disclaimer: ఈ సమాచారం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి