Men Hair Care Oils: ఆడవాళ్ల మాదిరి మగవాళ్లకు కూడా హెయిర్ ఫాల్ సమస్యలు పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే వాతావరణ కాలుష్యం వల్ల ఇలా జరుగుతుంది అయితే కొన్ని రకాల హెయిర్ ఆయిల్ వాడటం వల్ల హెయిర్ ఫాలికల్స్ బలపడి మంచి మృదువుగా మారతాయి. ఈ మగవారి బలమైన జుట్టుకు ఆరోగ్యకరమైన టాప్ 5 ఆయిల్స్ ఏమో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 కొబ్బరి నూనె..
కొబ్బరి నూనె ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు ఇందులో మన జుట్టుకు లోతైన పోషణను అందించే గుణం ఉంటుంది మగవారి జుట్టు కుదుళ్లకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది ముఖ్యంగా డాండ్రఫ్ రాకుండా నివారించి జుట్టు పొడిబారకుండా కొబ్బరి నూనె కాపాడుతుంది ముఖ్యంగా కుదుర్ల ఆరోగ్యానికి కొబ్బరి నూనె ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాదు జుట్టు మందంగా పెరుగుతుంది.


టీ ట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆయిల్ కూడా మగవారి జుట్టు పోషణకు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే టీ ట్రీ ఆయిల్లో అనేక సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నారు. ఇందులో విటమిన్స్ ,మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇది కుదుళ్ల నుంచి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ప్రేరేపిస్తుంది. అంతే కాదు డాండ్రఫ్ రాకుండా నివారించి పొడిబారిన జుట్టుకు చెక్ పెడుతుంది జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.


ఇదీ చదవండి:  నెయ్యి ఇలా పెదాలకు అప్లై చేస్తే నేచురల్‌గా పింక్ రంగులోకి మారిపోతాయి..


ఆర్గాన్ ఆయిల్..
కొబ్బరి నూనె మాదిరి ఆర్గాన్ ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగించవచ్చు. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మగవారి జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఆర్గాన్ ఆయిల్ వినియోగించాలి ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి ఇది లోతైన చుట్టు పోషణ అందిస్తుంది ఆర్గాన్ ఆయిల్ ని వినియోగించాలి.


ఆముదం నూనె..
ఆముదం నూనెలో కూడా ఇలాంటి ఆక్సిడేటీవ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి నివారిస్తాయి. బ్లడ్ సర్కులేషన్ ని మెరుగు చేస్తుంది. ఆముదం నూనె కూడా మన అమ్మమ్మల కాలం నుండి జుట్టుకు ఉపయోగిస్తారు అయితే మగవారు జుట్టు బలంగా పెరగడానికి కూడా ఆమోదం నూనె ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది.


ఇదీ చదవండి:   తల్లి డ్యాన్సర్‌.. తండ్రి స్టార్‌ క్రికెటర్‌.. ఆసక్తికరమైన సనా గంగూలీ ఎంచుకున్న కెరీర్‌ ఏంటో తెలుసా?


జోజోబా ఆయిల్..
జోజోబా ఆయిల్ కూడా కొబ్బరినూన మాదిరి జుట్టుకు ఉపయోగించవచ్చు. ఇది ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. తక్కువ బరువుతో కలిగి ఉండటం వల్ల దీన్ని ఈజీగా ఉపయోగించవచ్చు. ఇది హెయిర్ లాక్స్ మాయిశ్చర్ అందిస్తుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ముఖ్యంగా జోజోబా ఆయిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది హెయిర్‌ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook