ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 అంటే ప్రేమికులకు అత్యంత ఉత్సాహమైన, ఆనందమైన రోజు. ప్రేమను వ్యక్తపరిచే రోజుగా, ప్రేమించే రోజుగా ప్రపంచ ప్రేమికులంతా జరుపుకునే రోజు. ఇది వాలంటైన్ డే కాదు. వాలెంటైన్ వీక్ అని చాలా తక్కువమందికి తెలుసు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాలెంటైన్ డే అంటే గుర్తొచ్చేది ఎర్రటి గులాబీలు కూడా. ఎరుపు రంగుతో డామినేట్ చేసే గులాబీల్ని చూడగానే..మీ మనస్సు కూడా రొమాంటిక్ కాక తప్పదు. వాలెంటైన్ అనేది వారం రోజులు జరుపుకునే వేడుక. వాలెంటైన్ వారం ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమైంది. రేపు వాలెంటైన్ వేడుకతో ముగియనుంది. 


వాలంటైన్ వారం రేపు అంటే ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ప్రతియేటా ఫిబ్రవరి నెలంటే వాలంటైన్స్ డే గుర్తొస్తుంటుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమై..14తో ముగుస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీన రోజ్ డే, 8వ తేదీన ప్రపోజ్ డే, 9వ తేదీన చాకొలేట్ డే, 10వ తేదీన టెడ్డీ డే ,11వ తేదీన ప్రామిస్ డే, 12 వ తేదీన హగ్ డే, 13వ తేదీన కిస్ డే, 14వ తేదీన వాలంటైన్స్ డేగా జరుపుకుంటారు.


ప్రేమకు ప్రతిరూపంగా సెయింట్ వాలెంటైన్ జ్ఞాపకంగా వాలెంటైన్ డే జరుపుకోవడం ఆనవాయితీ. క్రిస్టియన్ కేలండర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రేమికులు. వాలెంటైన్ డే రోజు..అందమైన సందేశాలు, ట్రీట్, బహుమతులు, గులాబీల రూపంలో ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ జరుపుకుంటారు. 


Also read: Rose petals: అందానికే కాదు, ఒత్తిడి సైతం చిటికెలో దూరం చేసే రోజ్ పెటల్స్ స్నానం, ఎలాగంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook