COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Valentine's Day 2024 Meaning of Each Colour Rose In Telugu: ప్రేమికులకు ఫిబ్రవరి నెల ఎంతో ప్రసిద్ధి. ఈ నెలలోనే ప్రేమ పక్షులు వాలెంటెన్స్ వీక్ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 7వ తేదీన రోజ్ డే తో వాలెంటెన్స్ వారం ప్రారంభం కాబోతోంది. రోజ్ డేతో ప్రారంభమయ్యే ఈ వారం వాలెంటెన్స్ రోజు ముగిస్తుంది. ఈ వారంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ వాలెంటైన్స్ డే వీక్‌లో భాగంగా ప్రారంభమయ్యే మొదటిరోజు రోస్ డే ఎంతో కీలకం.. ఎందుకంటే ఇదే రోజు ఒకరిపై ఉన్న ప్రేమను ఒకరు గులాబీలను ఇచ్చిపుచ్చుకుంటూ తెలియజేసుకుంటారు. అయితే ఈరోజు ఇచ్చే ఒక్కొక్క రంగు గులాబీ పువ్వు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్యత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


గులాబీ పువ్వు రంగుల ప్రాముఖ్యత:
రెడ్ రోజ్:

మనలో ఉన్న ప్రేమను ఇతరులకు వ్యక్తపరచడానికి ఈ వ్యాలెంటెన్స్ వారంలో ఎర్ర గులాబీని వినియోగిస్తారు. ఒక రకంగా ప్రేమ భాషలో చెప్పాలంటే రెడ్ రోజ్ ను 'ఐ లవ్ యూ' అనే అక్షరాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ వారంలో ఎవరినైనా ప్రపోజ్ చేయాలనుకునేవారు రెడ్ రోస్ ని గిఫ్ట్ గా వస్తే వారికి అర్థమయిపోతుంది. అంతే కాకుండా ఈ ఎరుపు రంగు గులాబీని సంబంధం పట్ల గౌరవంతో పాటు శృంగారాన్ని కూడా సూచిస్తారు.


పింక్ రోజ్:
ఎవరికైనా ఈరోజు అమ్మాయిలు గానీ అబ్బాయిలు కానీ పింక్ రోజ్ ఇస్తే.. అది తప్పకుండా నిజమైన స్నేహానికి ధన్యవాదాలు చెప్పినట్లేనని ప్రేమ భాషలో అర్థం. కాబట్టి మీలో కూడా ఎవరైనా హానెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా ఈ వాలెంటెన్స్ వీక్ లో పింక్ రోజ్ ని ఇవ్వండి.


పర్పుల్ రోజ్:
ప్రేమ భాషలో పర్పుల్ కలర్ కలిగిన రోజ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కలర్ కలిగిన రోజ్ ని వాలెంటైన్స్ వీక్ లో భాగంగా ఇస్తే ఇద్దరి మధ్య ఉన్న నిజమైన స్నేహాన్ని ముందుకు తీసుకెళ్దాం అనే అర్ధాన్నిస్తుంది. అంతేకాకుండా ఇది స్వచ్ఛమైన స్నేహానికి గుర్తింపు అని కూడా సూచిస్తుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఎల్లో కలర్ రోజ్:
పసుపు రంగు కలిగిన గులాబీ పువ్వు సంతోషకరమైన స్నేహమని సూచిస్తుంది. కాబట్టి ఈ వాలెంటైన్స్ వారంలో భాగంగా మీలో ఉన్న దగ్గరి స్నేహితులకు ఎల్లో కలర్ కలిగిన గులాబీ పువ్వులు ఇస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. 


తెల్ల గులాబీ:
ఈ వాలెంటైన్స్ వీక్ లో భాగంగా వైట్ కలర్ కలిగిన రోజ్ ఫ్లవర్ ని ఎవరికైనా ఇస్తే.. దాని అర్థం ఎల్లప్పుడు మీరు ఆ వ్యక్తులను నిజమైన స్నేహితులుగా మేలుకోరే వ్యక్తులుగా అర్ధాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇది స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter