Pakam Garelu: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే పాకం గారెలు...
Pakam Garelu Recipe: పాకం గారెలు తీపి వంటల ప్రియులకు నిజమైన పరమాన్నం. మినప పప్పుతో చేసిన వడలను తీపి పాకంలో నానబెట్టి తయారు చేసే ఈ వంటకం, నోట్లో వేస్తే కరిగిపోయేంత రుచికరంగా ఉంటుంది.
Pakam Garelu Recipe: పాకం గారెలకు తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా శ్రావణమాసం వంటి పండుగ సందర్భాల్లో ఇవి ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీని తయారు చేయడానికి కొంచెం సమయం పడుతుంది. వరలక్ష్మీ వ్రతం స్పెషల్ సందర్భంగా పాకం గారెలను ఇలా తయారు చేసుకోండి.
పాకం గారెల ప్రత్యేకతలు:
పాకం గారెలు ఎంతో తీపిగా ఉంటాయి. కాబట్టి షుగర్ తక్కువగా తీసుకొనేవారు తక్కువగా తినడం మంచిది. వడల మృదుత్వం, పాకం తీపి కలయిక వల్ల అవి నోట్లో వేస్తే కరిగిపోతాయి. చేతితో ఒత్తి తయారు చేసిన వడల ఆకారం వీటికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది. పాకం గారెలు తయారు చేయడం కొంచెం సమయం తీసుకున్నప్పటికీ, వాటి రుచి అన్ని కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది. ఈ వంటకాన్ని ఒక్కసారైనా తప్పకుండా ప్రయత్నించండి.
ముందుగా కావాల్సిన పదార్థాలు:
డీప్ ఫ్రై చేయడానికి సరిపడా- ఆయిల్ , ఒక కప్పు- మినప్పప్పు, ఒకటిన్నర కప్పు- బెల్లం, సరిపడినన్ని - నీళ్లు, అర స్పూను- నిమ్మరసం, రుచికి సరిపడా - ఉప్పు
తయారీ విధానం:
ముందుగా మినపప్పును ఒక రాత్రి నీళ్లులో నానబెట్టుకోవాలి. ఉదయం మినపప్పను నీళ్లు లేకుండా మెత్తగా రుబ్బికోవాలి. ఈ పిండి అర టీ స్పూన్ ఉప్పును కలుపుకోవాలి. ఆ తరువాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని నూనెను వేడి చేయాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత చిన్న చిన్న గారెలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక్క స్టవ్‌పైన బెల్లం తురుమును తీసుకొని పాకం తయారు చేసుకోవాలి. గారెలు రెండు వైపులా గోధమ గోల్డ్ రంగులోకి మారిన తరువాత పాకంలో వేయాలి. ఇందులో కొంచెం నిమ్మరసం కలుపుకుంటే మరింత రుచి ఉంటుంది. చివరిగా యాలకుల పొడి కలుపుకొని పక్కకు తీసుకోవాలి. బెల్లం గారెలను రెండు గంటలపాటు నానాబెట్టి సర్వ్ చేసుకోవాలి.
చిట్కాలు:
పిండి పట్టుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా వేయకూడదు.
నూనె మధ్యస్థ స్థాయిలో వేడిగా ఉండాలి.
పాకం సన్నగా ఉండాలి.
గారెలను పాకంలో బాగా నానబెట్టాలి.
పాకం గారెల ఆరోగ్యలాభాలు:
శక్తివంతం: మినప పప్పు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆరోగ్యకరమైన కొవ్వులకు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.
జీర్ణ వ్యవస్థకు మంచిది: మినప పప్పులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది: మినప పప్పులో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకం.
బరువు నిర్వహణ: మినప పప్పులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆకలిని తగ్గించి, బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
ఇతర పోషకాలు: మినప పప్పులో ఐరన్, ఫోలేట్, జింక్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.