Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడుండాలి, ఎక్కడుండకూడదు, అలాగుంటే అంత ప్రమాదమా
Vastu Tips: భారతదేశంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానముంది. ఇళ్లు కట్టుకునేటప్పుడు, ఇంట్లో దిగేటప్పుడు, ఆఫీసు వ్యవహారంలో వాస్తు తప్పనిసరిగా చూస్తుంటారు. ఇంట్లో ఎక్కువగా గడిపే బెడ్రూమ్ వాస్తు ఎలా ఉండాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips: భారతదేశంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానముంది. ఇళ్లు కట్టుకునేటప్పుడు, ఇంట్లో దిగేటప్పుడు, ఆఫీసు వ్యవహారంలో వాస్తు తప్పనిసరిగా చూస్తుంటారు. ఇంట్లో ఎక్కువగా గడిపే బెడ్రూమ్ వాస్తు ఎలా ఉండాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు, శకునం చూసి ప్రతి పని చేయడం భారతీయులకు అలవాటు. సాంప్రదాయమనుకోవచ్చు. కొంతమంది నమ్మకపోవచ్చు గానీ వాస్తు శాస్త్రానికి దేశంలో ప్రత్యేక స్థానం మాత్రం ఉంది. ఆఫీసు వ్యవహారాలు కాకుండా ఇంట్లో ఎక్కువగా మనం గడిపేది బెడ్రూమ్‌లోనే. అందుకే బెడ్రూమ్ వాస్తు (Vastu for Bedroom) అనేది చాలా ముఖమంటున్నారు వాస్తు నిపుణులు. ఇంటికి కావల్సిన పాజిటివ్ ఎనర్జీని వాస్తు తీసుకొస్తుందంటున్నారు.
ఇంట్లో కుటుంబసభ్యుల బెడ్రూమ్స్ (Bedrooms) అన్నీ వివిధ దిక్కుల్లో ఉంటాయి. ఈశాన్యంలో, ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్స్ ఉండకూడదంటున్నారు వాస్తు నిపుణులు. ఈశాన్యంలో బెడ్రూమ్ ఉంటే అనారోగ్యానికి, పనుల్లో ఆటంకానికి, కుమార్తె వివాహం ఆలస్యం కావడానికి లేదా ఉద్యోగం లేకపోవడానికి కారణమవుతుంది.
ఇంటి పెద్ద బెడ్రూమ్ అనేది ఎప్పుడూ నైరుతిలోనే ఉండాలి. నైరుతిలో బెడ్రూమ్ ( Bedroom in South West) ఉంటే..స్థిరత్వం, బలం చేకూరుతుంది. నైరుతిలో ఉండే గదిని ఇంటిపెద్ద వినియోగించవచ్చు. ఇంట్లోని దక్షిణ మద్య బెడ్రూమ్‌ను ఆ ఇంటి పెద్దకొడుకు వినియోగించాలి. పెద్దవారికి సహజంగా నైరుతినే అనుకూలంగా ఉంటుంది. ఇంటిని నడిపేవారు లేదా తాతయ్యలు నైరుతి భాగంలో పడుకుంటే మంచిది.
ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉంటే నిద్రలేమి అంటే ఇన్‌సోమ్నియాకు (Insomnia) దారితీస్తుందంటున్నారు. అంతేకాకుండా ఇంట్లో టెన్షన్లు పెరుగుతాయని..ఫలితంగా దంపతులు విడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదే కాకుండా ఆగ్నేయమనేది ఆధిపత్యానికి చిహ్నమైనందున ఓ విధమైన అగ్రెసివ్ వైఖరికి కారణమవుతుంది. అయితే సిగ్గుపడే మనస్తత్వం కలిగిన చిన్నారులకు ఈ రూమ్ ప్రయోజనకరంగా ఉంటుంది.
అదే సమయంలో బెడ్రూమ్ ( Vastu for Bedroom) అనేది ఇంటి మధ్య భాగంలో ఉండకూడదు. ఎందుకంటే ఇంట్లోని మధ్యభాగమనేది బ్రహ్మస్థానంగా పిలవబడుతుంది. ఇంట్లో శక్తికి, వైబ్రేషన్స్‌కు కారణమవుతుంది. బెడ్రూమ్ ఉంటే దీనికి విఘాతం కలుగుతుంది. ఇంట్లో సుఖశాంతులుండాలంటే మధ్యభాగంలో బెడ్రూమ్ ఉండకూడదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook