Viral Fever Home Remedies: చలి వర్షాకాలంలో చాలామందిలో అనేక రకాల విష జ్వరాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందిలో డెంగ్యూ తో పాటు మలేరియా ఇతర జ్వరాలు రావడం తరచుగా చూస్తూ ఉంటాం. ఇలాంటి జ్వరాల బారిన పడిన వారిలో బాడీ మొత్తం వీక్ అయిపోతుంది. అంతేకాకుండా ఏడు నుంచి ఎనిమిది రోజుల వరకు తప్పకుండా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జ్వరం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వైద్య నిపుణులు సూచించిన ఔషధాలను తప్పకుండా వినియోగించాలి. జ్వరం తొందరగా తగ్గడానికి అనేక రకాల చిట్కాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విష జ్వరాలతో బాధపడుతున్న వారు తప్పకుండా వేడినీటితో స్నానం చేయాల్సి ఉంటుంది.. ఎందుకంటే వేడి నీటితో స్నానం చేయడం వల్ల బాడీ టెంపరేచర్ కొంత పెరిగినప్పటికీ క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు మీ షూస్‌కి సంబంధించిన సాక్సుల‌ను నీటిలో తడిపి వాటిని బాగా పిండి పాదాలకు తొడగడం వల్ల పాదాలలో వేడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే తప్పకుండా ఈ సమయంలో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల జ్వరం సులభంగా తగ్గే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలలో జ్వరం ఉంటే ఇలాంటి చిట్కాలు పాటిస్తే సులభంగా తగ్గిపోయి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


అంతేకాకుండా జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే చిన్న చిన్న టవల్స్ ను తీసుకొని చల్లని నీటిలో నానబెట్టి వాటిని బాగా పిండి నుదిటిపై పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మెడ పాదాల భాగాల్లో కూడా ఈ టవల్స్ ని ఉంచడం వల్ల జ్వరం సులభంగా తగ్గుతుంది. తరచుగా జ్వరం వస్తే ఆహారాలను అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్న వారు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 


జ్వరం ఎక్కువగా ఉన్నవారు అన్నం తినకపోవడం చాలా మంచిది..దీనికి బదులుగా విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం ఉన్నవారు నారింజ‌, ద్రాక్ష‌, కివీ వంటి పండ్ల‌ను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది. కాస్త జ్వరం తగ్గిన తర్వాత తప్పకుండా కూరగాయలు చికెన్‌తో తయారుచేసిన సూప్‌ని తాగడం మంచిది. ఇలా తాగడం వల్ల జ్వరం మరింత తగ్గుతుంది అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter