Vitamin B12 Rich Vegetarian Food: విటమిన్ బి-12 మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం. ఒక వేళా ఈ లోపంతో బాధపడితే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ విటమిన్‌ లోపం వల్ల  మెదడు, నాడీ వ్యవస్థపై కూడా చెడు ప్రభావం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరిలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ లోపం సమస్యలతో బాధపడేవారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటివలే పలు నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం..  కొంతమందిలో మానసిక సమస్యలు, ఎముకలు, కీళ్ల నొప్పులు వస్తున్నాయని పేర్కొన్నాయి. అయితే ఈ లోపం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారంలో మాంసం, చేపలు, గుడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శాఖాహారులైతే ఈ కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ B12 సమృద్ధిగా ఉన్న శాఖాహారం ఆహారాలు ఇవే:
1. బ్రోకలీ:

గ్రీన్ వెజిటేబుల్స్ విషయానికి వస్తే.. బ్రోకలీ శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని విటమిన్ బి-12 లోపాన్ని నియంత్రించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో హిమోగ్లోబిన్ పెంచేందుకు సహాయపడుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా బ్రోకలీని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.


2. సోయా ఉత్పత్తులు:
సోయా ఉత్పత్తులు కూడా శరీరానికి చాలా మంచివి. ప్రస్తుతం మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అయితే విటమిన్ బి-12 లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా  సోయాబీన్, సోయా పాలు, టోఫు వంటి ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.


3. ఓట్స్:
బరువు తగ్గడానికి చాలా మంది ఓట్స్‌ మీల్స్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలగా ఉపయోపడతాయి. ఇందులో విటమిన్ బి12 అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల  శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.


4. పెరుగు:
పెరుగు కూడా శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పెరుగులో విటమిన్ బి12తో పాటు విటమిన్ బి1, విటమిన్ బి2 కూడా లభిస్తాయి. కాబట్టి కొవ్వు తక్కువగా ఉండే పెరుగును ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: మూడు పెళ్లిళ్లు-మూడు పేర్లు, రెండో భర్తతో అలా ఉందని భార్యను దారుణంగా చంపిన మూడో భర్త


 

Also Read: Bandla Ganesh Tounge Slip: ధమాకా సక్సెస్ మీట్లో ‘బూతు’ జారిన బండ్ల.. ఇప్పుడేమో ఇలా!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook