Fat Burning Smoothies:  మీరు బరువు తగ్గించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా? అయితే, కంగారుపడకండి. కొన్ని ఆహారాలు రుచికరంగా ఉండటమే కాకుండా కొవ్వును కరిగించే శక్తి వాటికి ఉంటుంది. దీంతో తింటూనే బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరెంజ్ బ్లూబెర్రీ స్మూథీ..
మీరు తింటూనే బరువు తగ్గాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఆరెంజ్ బ్లూ బెర్రీ స్మూథీ. ట్యాంగీ స్వీట్ ఆరెంజ్, బ్లూబెర్రీ రుచికరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ కూడా ఇమ్యూనిటీ బూస్ట్ మంచి ఎంపిక. దీంతో మీరు ఆరోగ్యకరంగా ఉంటూనే బరువు తగ్గుతారు. ఈ స్మూథీ తయారీకి ఆరెంజ్, బ్లూబెర్రీలు రెండూ కలిపి బ్లెండ్ చేసుకోవాలి. అందులో బాదం పాలు,ఐస్ వేసుకోవాలి. ఎంతో రుచికరమైన హెల్తీ ఆరెంజ్, బ్లూబెర్రీ స్మూథీ రెడీ.


ఇదీ చదవండి:  పీరియడ్ పెయిన్స్ తో బాధపడుతున్నారా? ఈ 7 హోం రెమిడీస్‌లో ఏదో ఒకటి ట్రై చేయండి..   


పీనట్ బట్టర్ స్మూథీ..
బరువు తగ్గడానికి పీనట్ కూడా బెస్ట్ ఆప్షన్. పండిన అరటిపండ్లు, పీనట్ బట్టర్, బాదంపాలు, ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ స్మూథీని తయారు చేసుకోండి. ఈ స్మూథీ తీసుకోవడం వల్ల చాలా సమయం వరకు మీకు ఆకలి కూడా ఉండదు. పీనట్ బట్టర్ లో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. దీంతో మీరు మీకు ఇష్టమైన స్మూథీని తీసుకుంటూ బరువు తగ్గొచ్చు.


ఇదీ చదవండి: మీరూ బెడ్‌పై కూర్చొని తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ సమస్యలు తప్పవు..


మ్యాంగో ప్రొటీన్ స్మూథీ..
పండిన మామిడికాయలో కండరాల అభివృద్ధికి సహాయపడే ప్రొటీన్లు ఉంటాయి. ఇది మంచి వర్కౌట్ స్నాక్. మామిడిపండ్లు, వనీల్లా ప్రొటీన్ పౌడర్, కొబ్బరినీరు,ఐస్ క్యూబ్స్ వేసుకుని తయారు చేసుకోవాలి. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.ఎలక్ట్రోలైట్, న్యూట్రియేంట్స్ ఉండటం వల్ల ఎక్కువ సమయం రిఫ్రెష్ గా ఉంటారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter