భారతీయులు వంటల్లో తప్పకుండా వినియోగించే పసుపు కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన ఔషధం. క్రమం తప్పకుండా పసుపు తీసుకుంటే...కొద్దిరోజుల్లోనే కొవ్వు కరిగిపోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి భారతీయని కిచెన్‌లో తప్పకుండా ఉండేది పసుపు. పసుపు లేకుండా ఏ వంటా ఉండదు. పసుపు అనేది కేవలం రుచి పెంచడమే కాకుండా...అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కల్గిస్తుంది. అందుకే చాలామంది పసుపు పాలు తాగుతుంటారు. పసుపు పాలతో సైతం చాలా లాభాలున్నాయి. ఇప్పుడు పసుపు నీళ్ల ప్రయోజనాలు తెలుసుకోవాలి. పసుపు నీళ్లతో బరువును అత్యంత వేగంగా తగ్గించుకోవచ్చు.


పసుపులో ఉండే చాలా ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆరోగ్యానికి చాలా లాభదాయకం. చాలా రకాల రోగాల్ని దూరం చేస్తుంది. అదే సమయంలో పసుపును బరువు తగ్గేందుకు కూడా ఉపయోగిస్తారు. 


బరువు ఎలా తగ్గుతుంది


పసుపులో ఉండే పోషక పదార్ధాలు బరువు తగ్గేందుకు దోహదపడతాయి. పసుపులో పోలీఫెనాల్, కర్‌క్యూమిన్‌లు కొవ్వు కరిగిస్తాయి. పసుపు నీళ్లు తాగితే బరువు వేగంగా తగ్గుతారు. నేచురల్ పసుపు వాడటం చాలా మంచిది. రెండు కప్పుల నీళ్లలో..పసుపు కొమ్ము వేసి బాగా ఉడికించాలి. ఎంత అంటే నీళ్లు సగానికి తగ్గేంతవరకూ. దీనివల్ల పసుపులో ఉండే పోషకాలన్నీ నీళ్లలో చేరిపోతాయి. ఈ నీళ్లను ఉడికించి..అందులో కొద్దిగా తేనె కలుపుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ప్రతిరోజూ పరగడుపున తాగడం వల్ల బరువు తగ్గడం ప్రారంభమౌతుంది.


పసుపు నీళ్ల ప్రయోజనాలు


పసుపు నీళ్లు తాగడం వల్ల బరువు వేగంగా తగ్గడమే కాకుండా...ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. పరగడుపన పసుపు నీళ్లు తాగితే..చాలా రకాల నొప్పులు దూరమౌతాయి.


పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఇమ్యూనిటీ పెంచేందుకు ఉపయోగపడతాయి. పసుపు నీళ్లు తాగడం వల్ల పలు వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరమౌతాయి.


పసుపు నీళ్లు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది. ఈ నీళ్లు తాగడం వల్ల రక్తం పల్చగా ఉంటుంది. ఫలితంగా బ్లాకేజ్ సమస్య ఏర్పడదు. పసుపు నీళ్లు క్రమం తప్పకుండా తాగడం అలవాటు చేసుకుంటే..బ్లడ్ షుగర్ లెెవెల్స్ నియంత్రణలో ఉండటమే కాకుండా..కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. సీజనల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి శరీరానికి రక్షణ కలుగుతుంది. ఎందుకంటే పసుపు నీళ్లు రోజూ తాగడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. 


Also read: Ceiling Fans: ఇండియాలో 3 రెక్కల సీలింగ్ ఫ్యాన్స్ అధికం, కారణమేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook