Weight Loss Fruit: పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడుతున్నారా.. అయితే క్రమం తప్పకుండా ఈ పండును తినండి..!
Weight Loss Fruit: బరువు తగ్గడం ఏ వ్యక్తికైనా అంత సులభం కాదు.. దీని కోసం సరైన వ్యాయామాలతో పాటు, ఆహారంపై శ్రద్ధ వహంచాల్సి ఉంటుంది. బరువు నియంత్రణ కోసం రాత్రి పూట మంచి పోషకాలున్న ఆహారం తిసుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
Weight Loss Fruit: బరువు తగ్గడం ఏ వ్యక్తికైనా అంత సులభం కాదు.. దీని కోసం సరైన వ్యాయామాలతో పాటు, ఆహారంపై శ్రద్ధ వహంచాల్సి ఉంటుంది. బరువు నియంత్రణ కోసం రాత్రి పూట మంచి పోషకాలున్న ఆహారం తిసుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా ఉదయం పూట పలు రకాల పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
ఆరెంజ్ తింటే బరువు తగ్గుతారు:
నారింజలో పుష్కలంగా ఫైబర్ వంటి పోషకాలుంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడి.. కడుపు నొప్పుల సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా బరువును నియంత్రించేందుకు కృషి చేస్తుంది.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది:
నారింజలో 80 శాతంకు పైగా నీరుటుంది. అందుకే ఈ పండును తీసుకోవడం వల్ల శరీరాన్ని ఎక్కువ కాలం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గించడానికి ప్రభావవంతంగా కృషి చేస్తుంది.
రక్తంలో చక్కెర ప్రభావాన్ని తగ్గిస్తుంది:
రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్లే ఊబకాయం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీనిని నివారించేందుకు క్రమం తప్పకుండా ఆరెంజ్ పండ్లను తినమని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది:
ఆరెంజ్‌ని డిటాక్స్ ఫుడ్ అని కూడా అంటారు. దీన్ని తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపి.. అరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున కొవ్వును తగ్గించడానికి ప్రభావవంతంగా కృషి చేస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.