Weight Loss Remedies: బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల వ్యాయామాలతో పాటు డైట్‌లను పాటిస్తారు. ఇలా చేసినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతారు. అయితే బరువు తగ్గడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీటితో పాటు కొన్ని హోమ్ రెమెడీలను కూడా తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తాయని డైటీషియన్స్‌ చెబుతున్నారు.  ముఖ్యంగా బరువు తగ్గడానికి లెమన్‌ వాటర్‌ ఎంతగానో సహాయపడుతుందని వారంటున్నారు. ఈ వాటర్‌ను తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. ఇవే కాకుండా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవక్రియ పెరుగుదల: 
లెమన్‌లో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం జీవక్రియను పెంచడానికి ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కెలరీలను కూడా సులభంగా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా మలబద్ధకం, పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.


డీటాక్సిఫికేషన్: 
లెమన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి సహాయపడతాయి.  దీని కారణంగా జీర్ణక్రియ మెరుపడి శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని డైటీషియన్స్‌ చెబుతున్నారు.


హైడ్రేషన్: 
రోజు ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరం కూడా ఎంతో హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు హైడ్రేషన్‌ సమస్యల కారణంగా వచ్చే ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. బరువు తగ్గడాలనుకునేవారు తప్పకుండా ఖాళీ కడుపుతో పాటు చక్కెరకు బదులుగా తేనెను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్‌ అనే డిస్కౌంట్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్‌ మొబైల్స్ ప్రారంభం


ఇవి తప్పకుండా గుర్తుంచుకోండి:
బరువు తగ్గడానికి కేవలం లెమన్‌ వాటర్‌ మాత్రమే సరిపోదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనికి తోడు తప్పకుండా ప్రతి రోజు వ్యాయామాలతో పాటు డైట్‌ తప్పకుండా పాటించాలని వారంటున్నారు. అలాగే ఈ లెమెన్‌ వాటర్‌ను అతిగా తాగడం వల్ల బరువు తగ్గినప్పటికీ దంతాల ఎనామెల్‌ తగ్గిపోయి అనేక సమస్యలకు దారీ తీస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ఈ లెమన్‌ వాటర్‌ను తాగే క్రమంలో తప్పకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్‌ అనే డిస్కౌంట్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్‌ మొబైల్స్ ప్రారంభం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.