Weight Loss Tips: స్థూలకాయానికి ప్రధాన కారణం అస్తవ్యస్థమైన ఆహారపు అలవాట్లు, సక్రమంగా లేని జీవనశైలి. పని ఒత్తిడిలో పడి నిద్రకు దూరం కావడం, ఒత్తిడి ఇలా చాలా కారణాలు ప్రభావితం చేస్తుంటాయి. స్థూలకాయం కారణంగా డయాబెటిస్, గుండె వ్యాధులు, కేన్సర్ వెంటాడుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవన విధానంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో స్థూలకాయం సమస్య తలెత్తుతోంది. స్థూలకాయం కారణంగా గుండె వ్యాధులు, కేన్సర్, డయాబెటిస్, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. స్థూలకాయం తగ్గించుకునేందుకు 30-30-30 రూల్ వాడుకలో ఉన్న సత్ఫలితాలనిచ్చే విధానంగా ఉంది. అసలిది ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం.. 30-30-30 నియమం బరువు తగ్గించేందుకు ఓ మంచి విధానం. కేలరీలు, శారీరక శ్రమ, హెల్తీ డైట్‌పై ఆధారపడి ఉంటుంది ఈ విధానం. ఈ నియమం ప్రకారం కేలరీల్లో 30 శాతం తగ్గించుకోవాలి. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామం అవసరం. భోజనం కోసం కనీసం 30 నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది.


రోజుకు 30 శాతం అంటే దాదాపుగా 200-300 కేలరీలు తగ్గించుకుంటూ వెళ్లాలి. బరువు తగ్గించుకునేందుకు ఇదే అద్బుతమైన విధానం. వ్యాయామం ద్వారా కేలరీలు తగ్గించేందుకు, ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకు దోహదమౌతుంది. పరిమితమైన డైటింగ్ అనేది చాలా ముఖ్యం. తినే ఆహారం హెల్తీగా ఉండాలి. 


30-30-30 రూల్ ఎలా పాటించాలి


కేలరీలను రోజుకు 30 శాతం తగ్గించుకోవాలి. దీనికోసం రోజూ మీరు తీసుకునే డైట్ ద్వారా కేలరీలను లెక్కించుకోవల్సి వస్తుంది. ఆన్‌లైన్ కేలరీ క్యాలుక్యులేటర్ ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 30 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అంటే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి తప్పకుండా చేయాల్సి ఉంటుంది. భోజనం చేసేందుకు కనీసం 30 నిమిషాల సమయం కేటాయించాల్సి ఉంటుంది. భోజనం చేసే సమయంలో దృష్టి భోజనంపైనే ఉండాలి. టీవీ చూడటం, మొబైల్ చూడటం వంటివి చేయకూడదు.


Also read: Green Bananas: పచ్చి అరటి పండుతో సులువుగా బరువు తగ్గండి ఇలా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook