Weight Loss Tips: రోజూ ఉదయం ఆ పని చేస్తే..పదిరోజుల్లో బెల్లీ ఫ్యాట్ వెన్నలా కరగడం ఖాయం
Weight Loss Tips: స్థూలకాయం అనేది ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రోజూ ఉదయం లేవగానే ఆ పని చేస్తే..వెన్న కరిగినట్టు కరిగిపోతుంది బెల్లీ ఫ్యాట్
Weight Loss Tips: స్థూలకాయం అనేది ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రోజూ ఉదయం లేవగానే ఆ పని చేస్తే..వెన్న కరిగినట్టు కరిగిపోతుంది బెల్లీ ఫ్యాట్
ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, స్టైల్ ఆఫ్ వర్క్ కారణంగా స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ ప్రధాన సమస్యగా మారిపోయింది. ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. కానీ బెల్లీ ఫ్యాట్ మరో ఇబ్బందికర పరిణామంగా మారుతుంటుంది. బెల్లీ ఫ్యాట్ కారణంగా కొందరిలో ఆత్మ విశ్వాసం కూడా లోపిస్తుంది. అయితే కొన్ని ఎక్సర్‌సైజ్‌ల ద్వారా బెల్లీ ఫ్యాట్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉదయం లేవగానే పరగడుపున ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చో తెలుసుకుందాం..
బెల్లీ ఫ్యాట్ తగ్గించే ఎక్సర్‌సైజ్
బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు క్రంచెస్ అనేది ముఖ్యమైన ఎక్సర్‌సైజ్. ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్‌సైజ్ గురించి చెప్పుకుంటే..క్రంచెస్ ప్రధానంగా విన్పిస్తుంటుంది. ఇది చేయడం కూడా సులభమే. ముందుగా మీ మోకాళ్లను మడిచి..మీ కాళ్లను నేలపై ఆన్చి సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు చేతుల్ని పైకి లేపి తల వెనుక ఉంచాలి. ఇప్పుడు మీ శరీరంపై భాగాన్ని సగం ముందుకు వంచాలి. ఇలా 10-15 సార్లు చేస్తే బెల్లీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది.
జుంబా అనేది ఇంట్రస్టింగ్ వర్కవుట్. అద్బుతమైన ఫలితాలు సాధించవచ్చు. జుంబా వర్కవుట్ అనేది ఒక హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్. ఇది బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించేందుకు, కొవ్వు కరిగించేందుకు దోహదపడుతుంది. కడుపు దగ్గర ఉండే ఫ్యాట్ నుంచి ఉపశమనం పొందేందుకు రోజూ ఉదయం పూట కాస్సేపు జుంబా చేస్తే మంచి ఫలితాలుంటాయి.
సైకిల్ నడపడం కూడా బెల్లీ ఫ్యాట్ కరిగించేందుకు అద్భుతమైన సాధనం. నిజంగానే సైక్లింగ్ అనేది అద్భుతమైన విధానం. సైకిల్ నడపడం వల్ల శరీరం మొత్తం బరువు తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ పరగడుపున సైక్లింగ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook