Rajma for weight loss: రాజ్మాను ఈ రూపంలో తీసుకుంటే..21 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గడం ఖాయం
Rajma for weight loss: బరువు తగ్గించేందుకు చాలా పద్ధతులున్నాయి. జిమ్ లేదా వ్యాయామం చేయకుండానే బరువు తగ్గించుకోవాలనుకుంటే మాత్రం..రాజ్మాను డైట్లో భాగంగా చేసుకోవాలి. అద్భుతమైన ప్రయోజనాలుంటాయి.
చాలామంది రాజ్మా ఇష్టంగానే తింటారు. కానీ అన్నంతో కలిపి తినడం అలవాటు. కానీ రాజ్మాను అన్నంతో కలిపి తింటే బరువు పెరగడం తధ్యం. అందుకే బరువు తగ్గించాలంటే రాజ్మాను ఎలా తీసుకోవాలో ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రాజ్మా తినడం వల్ల బరువు పెరుగుతారని చాలామంది భావిస్తారు. కానీ ఇది ముమ్మాటికీ తప్పు. రాజ్మాలో ఎన్నో పోషక పదార్ధాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. బరువు తగ్గించేందుకు దోహదపడతాయి. అయితే రాజ్మాను అన్నంతో కలిపి తింటే మాత్రం బరువు తగ్గరు సరికదా..బరువు పెరుగుతారు. మరి అధిక బరువుకు చెక్ పెట్టాలంటే రాజ్మా ఎలా తీసుకోవాలి, ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో పరిశీలిద్దాం..
బరువు తగ్గించేందుకు రాజ్మా ఎలా తీసుకోవాలి
రాజ్మా ప్రోటీన్లతో నిండి ఉండే పదార్ధం. ఇందులో పొటాషియం, ఫాస్పరస్, ఫైబర్, కాల్షియం వంటి న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. రాజ్మా కడుపును నింపుతుంది. దాంతో ఆకలి పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీరం మెటబోలిజంను వృద్ధి చేస్తుంది. ఫలితంగా శరీరంలో కేలరీలు వేగంగా కరుగుతాయి. బరువు తగ్గేందుకు దోహదమౌతుంది.
రాజ్మా సూప్
కచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే..రాజ్మా సూప్ తాగడం మంచి ఫలితాలనిస్తుంది. రాజ్మాను కూరగాయలతో కలిపి ఉడికించి రుచికరమైన సూప్ తయారు చేయవచ్చు. దీనిని బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకుంటే బరువు తగ్గేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
పెరుగుతో రాజ్మా
రాజ్మాను పెరుగుతో కలిపి రాయితా తయారు చేసి తినవచ్చు. రాజ్మాను ఉడికించి మిక్సీ చేయాలి. ఇందులో పెరుగు కలపాలి. పైన కొద్దిగా ఉప్పు, పెప్పర్, జీలకర్ర, పచ్చిమిర్చి వేస్తే రాయితా తయారైనట్టే. బరువు తగ్గేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. రాజ్మా రాయితాను మరింత రుచిగా మార్చేందుకు కొత్తిమీర, ఉల్లిపాయ కలపవచ్చు.
రాజ్మా సలాడ్
రాజ్మాను సలాడ్ రూపంలో తీసుకుంటే చాలా ఉపయోగం. ముందుగా రాజ్మాను ఉడికించి..అందులో ఉల్లిపాయలు, టొమటా, క్యారెట్ వంటి కూరగాయల్ని సన్నగా కోసుకుని కలుపుకోవాలి. ఇందులో ఆయిల్ లేదా నెయ్యి ఉండదు. అందుకే బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Also read: Valentine Week: ఫిబ్రవరి 7 నుంచే ప్రేమికులకు పండుగ.. 14 దాకా ఏరోజు ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook