Weight Loss Tips: కీరదోసకాయ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
Weight Loss Tips: కరోనావైరస్ కారణంగా చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. దీని వల్ల ఉద్యోగ్యులు ఇంటి నుంచే పని చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యారు.
Weight Loss Tips: కరోనావైరస్ కారణంగా చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. దీని వల్ల ఉద్యోగ్యులు ఇంటి నుంచే పని చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యారు. ముఖ్యంగా బరువు పెరగడం వంటి సమస్యలు అధికమయ్యాయి. ప్రస్తుతం చాలా మందిలో పొట్ట చుట్టు కొవ్వు విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఆహార నియమాలను తప్పని సరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ 2 కూరగాయలను తినండి:
బాడీని ఫిట్‌నెస్‌గా ఉంచుకోవాడానికి, శరీర ఆకృతిని పొందడం అంత సులభం కాదు. దీని కోసం ప్రతి రోజూ పలు రకాల ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద నిపుణుల తెలుపుతున్నారు. అయితే ఈ ఆహారంలో రెండు రకాల కూరగాయలను తినాలని సూచిస్తున్నారు. ఆ కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దోసకాయ:
మనం సాధారణంగా సలాడ్‌గా తినే దోసకాయ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.. దోసలో నీటి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉండడం వల్ల బరువుపను తగ్గించడానికి సహాయపడుతుంది.
కీరదోసకాయ:
కీరదోసకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో నీటి శాతం సమృద్ధిగా అధికంగా ఉంటుంది. కావున జీర్ణవ్యవస్థ మెరుగుపడి కడుపులో ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఈ కీరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తింటే.. పొట్ట త్వరగా నిండిపోయి ఎక్కువ సేపు ఆకలి వేయదు. పొట్ట చుట్టు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. లంచ్, డిన్నర్ సమయంలో దోసకాయ సలాడ్‌ను తప్పకుండా తినాలి. ఇందులో క్యారెట్, ఉల్లిపాయ, ముల్లంగి, టమోటా, నిమ్మరసం ఉండడం వల్ల పొట్టలోని కొవ్వు త్వరగా కరిగిస్తాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook