Weight Loss Tips: వేసవి కాలంలో ఉత్తర భారతీయులు శనగపిండితో చేసిన వంటలు ఎక్కువగా తింనేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇది రుచి ఇవ్వడమే కాకుండా శరీరానికి అనేక రకాలు ప్రయోజనాలను ఇస్తుంది. మండుతున్న ఎండల కారణంగా శరీరానికి ఉపశమనాన్ని ఇచ్చేందుకు శనగపిండితో చేసిన వంటకాలు(సత్తు) ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇందులో చాలా రకాలద పోషకాలుంటాయి. ఇవి బరువును తగ్గించి.. కొవ్వును నియంత్రించేందుకు దోహదపడతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనగపిండితో చేసిన ఈ వంటకాలు బరువు నియంత్రిస్తాయి:


శనగపిండిలో ఐరన్, ఫైబర్, మాంగనీస్, తక్కువ సోడియం, ప్రొటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పిండితో చేసిన వంటకాలను ఏం తినాలో తెలుసుకుందాం..


1. శనగపిండి రోటీ:


శనగపిండి రోటీని శతాబ్దాలుగా నుంచి వినియోగిస్తున్నారు. ఈ రోటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కావున బరువు తగ్గడానికి ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఈ పిండిలో  గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.


2. శనగపిండితో చేసిన రసం:


'శనగపిండి'ని సాధారణంగా సత్తు కా షర్బత్ అని కూడా పిలుస్తారు. దీనిని యుపి, బీహార్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారు. ఇది డ్రింక్‌ల చేసుకుని తాగితే.. శరీరం నుంచి  మలినాలను తొలగించే డిటాక్స్ డ్రింక్‌గా పని చేస్తుంది. అంతేకాకుండా పొట్టలో జీర్ణక్రియను శక్తి వంతంగా చేసి.. బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.


3. లిట్టి


లిట్టి పేరు చెప్పగానే అందరికీ నోరు ఊరుతుంది. ఇది  నార్త్ ఇండియా స్పెషల్ వంటకంగా భావిస్తారు. అంతేకాకుండా దీనిని  బీహార్ ట్రేడ్ మార్క్ ఫుడ్‌గా కూడా పిలుస్తారు. ఇది క్రమం తప్పకుండా తింటే.. శరీరంలో బరువు నియంత్రణలోకి వస్తుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


 



Also Read: Rain Alert: తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు 


Also Read: KTR MEET JUPALLI: అసంతృప్త నేతలకు తాయిలాలు.. బుజ్జగింపులు! టీఆర్ఎస్ లో కొత్త సీన్... కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook