Weight Loss Tips: నానబెట్టిన ఈ డ్రై ఫ్రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే.. బరువు తగ్గడం, మధుమేహానికి చెక్..!
Weight Loss Food: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల బరువు పెరుగుతున్నారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.
Weight Loss Food: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల బరువు పెరుగుతున్నారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానిరి నానబెట్టి వాల్‌నట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..
ప్రస్తుతం చాలా మంది రోజూ వారి ఆహారంలో డ్రై ఫ్రూట్‌లను ఆహారంగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాల్‌నట్స్‌లో కాల్షియం, పొటాషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం, జింక్, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిని రోజూ 2 నుంచి 3 తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి.
నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. బరువును నియంత్రిస్తుంది:
పెరుగుతున్న శరీర బరువును నియంత్రించుకోవడానికి క్రమం తప్పకుండా నానబెట్టిన వాల్‌నట్‌లను తప్పనిసరిగా తిసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రొటీన్లు అధిక పరిమాణంలో ఉంటాయి.
2. డయాబెటిస్‌పై ప్రభావం:
ప్రస్తుతం చాలా మంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ప్రతి రోజూ 2-3 నానబెట్టిన వాల్‌నట్‌లను తీసుకోవడం మంచిదనికి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.
3. జీర్ణక్రియ మెరుగు పడుతుంది:
అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు.. ఉదయం పూట నానబెట్టిన వాల్‌నట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణవ్యవస్థను మెరుగు పరుచుతాయి.
4. ఎముకలు దృఢంగా మారుతాయి:
వాల్‌నట్స్‌లో చాలా రకాల పోషకాలుంటాయి. ఇందులో ఉండే డ్రై ఫ్రూట్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్స్ శరీరంలోని ఎముకలు దృఢంగా తయారవుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!
Also read:MP Fire Accident: మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అగ్నికీలలు..పలువురు సజీవ దహనం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook