Weight Loss in 15 Days: కేవలం 15 రోజుల్లో బరువు తగ్గాలంటే ఇలా చేయండి!
Weight Loss Tips: వ్యాయామాల్లో స్కిప్పింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్కిప్పింగ్ చేయడం వల్ల 15 రోజుల్లో బరువు తగొచ్చు. కానీ, అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
Weight Loss Tips: వ్యాయామాల్లో స్కిప్పింగ్ చాలా సులభం. ఈ సాధారణ వ్యాయామంతో మీరు సులభంగా బరువు తగ్గొచ్చు. అయితే, కొంతమందికి స్కిప్పింగ్ ఎలా చేయాలో తెలియదు. దాని వల్ల వెంటనే బరువు తగ్గలేరు. అయితే రోజుకు అరగంట స్కిప్పింగ్ చేయడం వల్ల 15 రోజుల్లోనే బరువు తగ్గొచ్చు. కానీ, కొంతమంది రోజూ చేసినా.. బరువు తగ్గడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
స్కిప్పింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు..
స్కిప్పింగ్ క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు నియంత్రించుకోవడం సహా అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఇది మీ రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అయితే అందుకోసం మీరు రోజుకు 10 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బీపీ, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారు చేసే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
- ఎముకలలో నొప్పులతో బాధపడేవారు కూడా స్కిప్పింగ్ చేస్తే మేలు జరుగుతుంది. దీంతో పాటు బీపీ కూడా నార్మల్ అవుతుంది.
- ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే అలాంటి వారు తప్పనిసరిగా ఈ వ్యాయామం చేయాలి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
స్కిప్పింగ్ చేసే వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి!
- ఎవరైనా ఖాళీ కడుపుతో స్కిప్పింగ్ చేయకూడదు. దీని కారణంగా మీరు మీ కడుపులో నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
- అంతే కాకుండా ఆహారం తిన్న వెంటనే కూడా స్కిప్పింగ్ చేయకూడదు. తిన్న తర్వాత మీరు 1 గంట తర్వాత ఈ వ్యాయామం చేయవచ్చు.
- స్కిప్పింగ్ చేయడానికి ముందు ఏదైనా తేలికపాటి వ్యాయామం చేయడం మేలు. ఈ విధంగా చేయడం వల్ల స్కిప్పింగ్ చేసేందుకు శరీరం సహకరిస్తుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: High cholesterol warning Signs: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనడానికి సంకేతాలేంటో తెలుసా?
Also Read: Dangers of AC; ఎక్కువగా ఏసీలో కూర్చుంటే మీ ఆరోగ్యానికి ముప్పే..హాని కలిగించే అంశాలు ఏంటో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.