Weight Loss Tips With Rice Eating : మనలో చాలా మందికి రోజూ అన్నం తింటే తప్ప భోజనం చేసిన భావన కలగదు. అలాంటివారు అన్నం మానేసి డైటింగ్ చేయాలి అంటే చాలా కష్టపడతారు. పోనీ ఒక వారం రోజులు.. అన్నం తినకుండా డైటింగ్ చేసిన, వెంటనే రెండు రెట్లు అన్నం తినేస్తారు. ఇది మనలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య? అయితే అన్నం తింటూ కూడా డైటింగ్ చేసి బరువు తగ్గొచ్చు అన్న విషయం మీకు తెలుసా? అవునండి.. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలా తినాలి:


బరువు తగ్గాలి అని ఉన్నప్పటికీ.. రైస్ మానడం ఇష్టం లేనివారు.. తమ ఆహారపు అలవాట్లలో కొన్ని తేలికపాటి మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. తీసుకునే అన్నం క్వాంటిటీ మితంగా ఉండేలా చూసుకోవాలి. అన్నంతో పాటు సమ భాగంలో ఎక్కువ నూనె లేకుండా చేసిన తాలింపు, ఫైబర్ ఉన్న ఫుడ్స్, వెజిటేబుల్ సలాడ్స్ లాంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అధిక మోతాదులో అన్నం తీసుకోవడం తగ్గించడంతో మనం తీసుకుని క్యాలరీలను  కూడా నియంత్రించవచ్చు. 


అన్నం తినేటప్పుడు ఇతరత్రా ఆలోచనలు ఉండకుండా చూసుకోవాలి. టీవీ, సెల్ ఫోన్ లాంటి డిస్ట్రాక్షన్స్ ఉంటే మనం ఎంత తింటున్నామో అన్న విషయంపై మనకు అవగాహన ఉండదు. భోజనానికి గంట ముందు గోరువెచ్చటి నీరు ఒక గ్లాసుడు తీసుకోవాలి. భోజనానికి వీలైనంత చిన్న సైజు ప్లేటు వాడాలి. 


ప్రోటీన్స్:


బరువు తగ్గాలి అనుకునే వారికి ప్రోటీన్స్ ఎంతో ముఖ్యం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గ్రిల్డ్ చికెన్, చేపలు, బీన్స్, సోయా, పన్నీర్ లాంటి ఉత్పత్తులు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ ని అందిస్తాయి. తరచుగా ఆకలి వేసినప్పుడు ఫ్రూట్స్ లేదా మజ్జిగ లాంటిది తీసుకోవాలి. చాక్లెట్స్, స్వీట్స్ అస్సలు తినకండి. శరీరానికి అవస రమైన నీరు తాగడం మర్చిపోకండి.


మనం ఎంత ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము.. ఈ మూడు విషయాలు పరిగణలోకి తీసుకుంటే.. మీ ఊబకాయ సమస్య సులభంగా తగ్గిపోతుంది. వీలైనంత జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి.. తినేటప్పుడు బాగా నమిలి తినడం నేర్చుకోండి. తిన్న వెంటనే మంచినీరు త్రాగకండి. ఈ తేలికపాటి మార్పులు చేసుకుంటే చాలు మీరు రోజువారి ఇంట్లో తీసుకునే ఆహారంతోటే అద్భుతమైన రిజల్ట్ పొందగలుగుతారు.


Also Read: YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌


Also Read: Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter