Weight Loss Tips: రాత్రి పూట ఈ మూడు పదార్ధాలు తీసుకుంటే..వారంలో కొవ్వు కరగడం ఖాయం
Weight Loss Tips: ఆధునిక జీవనశైలిలో అధిక బరువు అనేది ప్రధానమైన సమస్య. రాత్రిపూట భోజనంలో కొన్ని మార్పులు చేస్తే కచ్చితంగా అంటే వారం రోజుల్లోనే కొవ్వు కరిగించవచ్చు..
Weight Loss Tips: ఆధునిక జీవనశైలిలో అధిక బరువు అనేది ప్రధానమైన సమస్య. రాత్రిపూట భోజనంలో కొన్ని మార్పులు చేస్తే కచ్చితంగా అంటే వారం రోజుల్లోనే కొవ్వు కరిగించవచ్చు..
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు చాలా ప్రయత్నలు చేస్తుంటాం. ఎందుకంటే అధిక బరువు అనేది ఎప్పుడూ సమస్యే. అధిక బరువు కారమంగా పలు వ్యాధులు ఎదుర్కోవల్సివస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ బరువును తప్పకుండా తగ్గించుకోవాలి. దీనికోసం ఎక్సర్‌సైజ్ ఒక్కటే సరిపోదు. డైట్ కూడా మార్చుకోవాలి. సరైన డైట్‌తో కూడా బరువు తగ్గించవచ్చు.
రాత్రి భోజనం అంటే డిన్నర్ అనేది ఎప్పుడూ తేలిగ్గా ఉండాలి. ఫలితంగా నిద్ర సంపూర్ణంగా ఉండటమే కాకుండా బరువు నియంత్రణలో ఉంటుంది. డిన్నర్ అనేది ఎప్పుడూ నిద్రకు కనీస గంట ముందు ఉండేట్టు చూసుకోవాలి. రాత్రి భోజనం తేలిగ్గా ఉంటే..బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. రాత్రి పూట ఏం తింటే మంచిదో తెలుసుకుందాం..
పెసర పప్పులో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో దోహదపడతాయి. మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే..డిన్నర్‌లో పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పును ఏ రూపంలో తీసుకున్నా ఫరవాలేదు.
సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. తినేందుకు లైట్‌గా ఉంటుంది. రోజూ కూడా తినవచ్చు. సగ్గుబియ్యంతో ఖిచిడీ చేసుకుని తింటే మంచి ఫలితాలుంటాయి. ఇందులో నెయ్యి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, బంగాళదుంప, సగ్గుబియ్యం, ధనియా కలవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
బొప్పాయి సలాడ్ కూడా చాలా మంచిది. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. బొప్పాయి సేవించడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
Also read: Mosquitoes Bite Reason: దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebo