Coffee And Ghee Benefits:  నెయ్యి కాఫీ ఒక ప్రత్యేకమైన పానీయం. ఇది ఇటీవలి కాలంలో ఆరోగ్యకరమైన పానీయం గా పేరుపొందింది. నెయ్యిలోని పోషకాలు, కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్యనిపుణులు  చెబుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెయ్యి కాఫీ చరిత్ర:


నెయ్యి కాఫీ యొక్క మూలాలు టిబెట్ ,  భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలకు చెందినట్లు చర్రిత చెబుతుంది. ఈ ప్రాంతాలలో, శతాబ్దాలుగా చలి నుంచి శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అలాగే శక్తిని పెంచడానికి నెయ్యి కాఫీని తాగుతున్నారు. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మానసికస్థితికి సరిగ్గా అవడం , హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం లాంటి ఎన్నో లాభాలు ఈ పానీయంలో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కొవ్వును కొవ్వుతోనే తొలగించడం ఈ నెయ్యి కాఫీ తాగుతారు. ఇది బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది. 


నెయ్యి కాఫీ: ప్రయోజనాలు, తయారీ విధానం


నెయ్యి కాఫీ ఒక ప్రత్యేకమైన పానీయం, ఇది కాఫీ, నెయ్యి, కొన్నిసార్లు ఇతర పదార్థాలను కలిపి తయారు చేస్తారు. 


నెయ్యి కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు:


జీవక్రియను పెంచుతుంది:


నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి.


బరువు తగ్గడానికి సహాయపడుతుంది: 


నెయ్యి కాఫీ ఆకలిని తగ్గిస్తుంది, శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.


జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది: 


నెయ్యి జీర్ణవ్యవస్థను మృదువుగా చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.


వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది: 


నెయ్యిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.


కీళ్లనొప్పులను తగ్గిస్తుంది:


 నెయ్యిలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.


 


నెయ్యి కాఫీకి కావాల్సిన పదార్థాలు:


1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి
1 టేబుల్ స్పూన్ నెయ్యి
1 కప్పు నీరు
1/2 కప్పు పాలు 
తేనె లేదా చక్కెర 


నెయ్యి కాఫీ తయారీ విధానం:


ఒక గిన్నెలో కాఫీ పొడి, నీరు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఆ తర్వాత కాఫీ మరుగుతున్నప్పుడు నెయ్యి వేసి కలపాలి.కాఫీ మరోసారి మరుగుతున్నప్పుడు స్టవ్ నుంచి దించివేయాలి.పాలు , తేనె లేదా చక్కెర వేసి బాగా కలపాలి. ఈ విధంగా కాఫీ తయారు అవుతుంది. దీని తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. 


Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter